ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Honeymoon case: హనీమూన్ హత్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. సోనమ్ లవర్ రాజ్ కాదా..

ABN, Publish Date - Jun 12 , 2025 | 09:44 AM

మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన భర్త రాజా రఘువంశీని సోనమ్ అతి దారుణంగా హత్య చేయించింది. అయితే, ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ సింగ్ కుష్వాహాను సోనమ్ కేవలం తన బంటుగా వాడుకొని మరో వ్యక్తితో పారిపోయేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

Sonam Raja Raghuvanshi

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ మర్డర్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హనీమూన్ కోసమని భర్త రాజా రఘువంశీతో కలిసి మేఘాలయ వెళ్లిన భార్య సోనమ్ రఘువంశీ పక్కా ప్లాన్‌తోనే అక్కడే అతడిని అతి కిరాతకంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. రాజ్ కుష్వాహా అనే వ్యక్తి, అతని ముగ్గురు స్నేహితులు కలిసి కత్తితో దారుణంగా చంపేలా స్కెచ్ వేసింది. అయితే, ఈ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటూ మిస్టరీగా మారుతోంది.

పోలీసులు వారిని విచారిస్తున్న సమయంలో ఇంకా చాలా అనుమానాలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరు అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రధాన నిందితుడిగా రాజ్ అనిపిస్తున్నా తాజా వివరాల ప్రకారం, సోనమే అసలు కుట్రదారి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె రాజ్‌ను బంటుగా వాడుకుని రాజాను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

సోనమ్‌, రాజ్‌కి రిలేషన్ ఉందని, అతడితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకునేలా భర్త రాజ్ అడ్డుతొలగించుకోవాలనే రాజాని హత్య చేయించిందని అందరు అనుకుంటున్నారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అసలు రాజ్ తన ప్రియుడు కాదని తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం, రాజ్ సోనమ్‌ను 'దీదీ' అని పిలిచేవాడట. సోనమ్ కూడా అతడికి చాలా సార్లు రాఖీ కట్టేదట. వీరిద్దరికీ ఎలాంటి రిలేషన్ లేదని స్థానికులు అంటున్నారు.

అయితే, వీళ్లిద్దరికీ నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే, సోనమ్ తన భర్తను ఎవరి కోసం చంపింది? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం రాజ్‌ను అడ్డుపెట్టుకుని భర్తను చంపించిందని, అసలు ప్రియుడు వేరే వ్యక్తి ఉన్నాడని తెలుస్తోంది. అతడి కోసమే ఇంట్లో నమ్మకంగా ఉన్న రాజ్‌ సహాయం తీసుకుని భర్త హత్యకు కుట్ర పన్నిందని సమాచారం. కాగా, హనీమూన్‌ హత్యకేసులో నిందితురాలు సోనమ్‌ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

Also Read:

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

ఇదోరకం మోసం.. రూ.10వేలకు అరగంటలో 5వేలు లాభం

For More National News

Updated Date - Jun 12 , 2025 | 10:26 AM