మావోయిస్టుల ఘాతుకం ముగ్గురి హత్య.. 12 మంది కిడ్నాప్
ABN, Publish Date - Jun 18 , 2025 | 05:59 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పెద్దకుర్మ గ్రామానికి చెందిన చెందిన ముగ్గురు స్థానికులను మంగళవారం సాయంత్రం హత్యచేశారు.
మృతులంతా లొంగిపోయిన నక్సల్స్ కుటుంబ సభ్యులు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఘటన
చర్ల, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పెద్దకుర్మ గ్రామానికి చెందిన చెందిన ముగ్గురు స్థానికులను మంగళవారం సాయంత్రం హత్యచేశారు. వీరిలో ఓ విద్యార్థిని కూడా ఉంది. హత్యలతో పాటు మావోయిస్టులు 12 మందిని కిడ్నాప్ చేశారు. మృతులంతా గతంలో లొంగిపోయిన గంగలూరు ఏరియా కమిటీ చెందిన డీవీసీఎం కమిటీ సభ్యుడు పొడియ దినేశ్ కుటుంబ సభ్యులుగా సమాచారం.
ఈ ఏడాది మార్చి 4న బీజాపూర్ పోలీసులు ఎదుట దినేశ్ లొంగిపోయారు. ఆ తర్వాత గంగలూరు అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనకు ప్రతీకారంగానే నక్సల్స్ బుధవారం హత్యలు, అపహరణలకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. బీజాపూర్ పోలీసులు మాత్రం ఈ ఘటనను ఇంకా ధ్రువీకరించలేదు.
Updated Date - Jun 18 , 2025 | 05:59 AM