ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Man Forced To Marry Aunt: అత్తతో ఎఫైర్.. అల్లుడి కొంప ముంచింది..

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:15 AM

Man Forced To Marry Aunt: శివచంద్ర గ్రూపు చేసిన దాడిలో మిథిలేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక, గ్రామస్తులు గొడవ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవటంతో శివచంద్ర గ్రూపు అక్కడినుంచి పారిపోయింది.

Man Forced To Marry Aunt

నేడు వివాహేతర సంబంధాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. పెళ్లిళ్ల వరకు వెళుతున్నాయి. ఆడవాళ్ల ఎఫైర్ల విషయంలో భర్తలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. వారికి నచ్చిన వాళ్లతో పెళ్లి చేస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు తన అత్తతో సంబంధం పెట్టుకున్నాడు. ఓ రోజు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో అల్లుడ్ని చితక్కొట్టిన మామ.. బలవంతంగా అత్తతో పెళ్లి చేశాడు. కిడ్నాప్ చేసి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన బీహార్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సుపౌల్ జిల్లా, భీమ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఏరియాకు చెందిన శివచంద్ర, రితా దేవీ భార్యాభర్తలు. వీరికి పెళ్లై ఐదేళ్లు పైనే అయింది. నాలుగేళ్ల ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితే, రితా దేవి గత కొంతకాలం నుంచి అల్లుడి వరసయ్యే మిథిలేష్ కుమార్ ముఖియా అనే యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. ఈ విషయం శివచంద్రకు తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. తప్పు చేసిన తన భార్యకు అల్లుడితో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. శివచంద్రతో పాటు మరికొంతమంది మిథిలేష్‌ను కిడ్నాప్ చేశారు.

జీవచ్చపూర్‌లోని ఇంటికి తీసుకువచ్చారు. దారుణంగా చితక్కొట్టి మరీ అత్తతో పెళ్లి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మిథిలేష్ తండ్రిని, తల్లిని కూడా కొట్టారు. శివచంద్ర గ్రూపు చేసిన దాడిలో మిథిలేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక, గ్రామస్తులు గొడవ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవటంతో శివచంద్ర గ్రూపు అక్కడినుంచి పారిపోయింది. శివచంద్ర గ్రూపు దాడిలో తీవ్రంగా గాయపడ్డ మిథిలేష్‌ను తల్లిదండ్రులు నార్పత్‌గంజ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అరారియ సర్ధార్ ఆస్పత్రికి తరలించారు. ఇక, మిథిలేష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దేశ వ్యాప్తంగా బంద్.. ఈ రాష్ట్రంలో అధిక ప్రభావం..

మర్డర్ కేసు.. నిమిషా ప్రియకు 16వ తేదీన ఉరి..

Updated Date - Jul 09 , 2025 | 02:18 PM