Maharashtra Incident: మరో దారుణం.. పెళ్లైన 15 రోజులకే భర్తను ఏం చేసిందంటే..
ABN, Publish Date - Jun 12 , 2025 | 10:40 AM
హనీమూన్ హత్య కేసు మరిచిపోకముందే మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మరో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన 15 రోజులకే భర్తను భార్య హత్య చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి అంటేనే నేటి సమాజం భయపడుతోన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భార్య భర్తను చంపడం, భర్త భార్యను హత్య చేయడం వంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా జరుగుతున్నాయి. మేఘాలయ రాజా రఘువంశీ హత్య కేసు మరిచిపోకముందే తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మరో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన 15 రోజులకే భర్తను భార్య అతి దారుణంగా హత్య చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే..
రాధిక(27) అనే యువతి భర్త అనిల్ లోఖండే(53)ను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వారు పెళ్లి చేసుకున్న కేవలం 15 రోజులకే జరిగింది. మంగళవారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, బుధవారం తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో భర్త అనిల్ నిద్రిస్తుండగా రాధిక గొడ్డలితో అతని తలపై దాడి చేసిందని, దీంతో అనిల్ అక్కడికక్కడే మరణించాడని స్థానికులు అంటున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, అనిల్ లోఖండే మొదటి భార్య క్యాన్సర్‌తో మరణించింది. దీంతో అతడు రాధికను రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహం అయిన దగ్గర నుండి అనిల్ తన భార్యను శారీరకంగా ఇబ్బంది పెట్టేవాడని, దీన్ని తట్టుకోలేక కోపంతో రాధిక హత్య చేసిందని అనుమానిస్తున్నారు. రాధికను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను కోర్టులో హాజరు పరచగా, కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
Also Read:
సోనమ్ మాస్టర్ ప్లాన్.. లవర్ రాజ్ కాదా..
For More National News
Updated Date - Jun 12 , 2025 | 01:41 PM