ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై కీలక విషయాన్ని వెల్లడించిన ఆదర్శ్ రౌత్

ABN, Publish Date - May 01 , 2025 | 10:13 AM

Pahalgam Terror Attack: ఉగ్రదాడికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రదాడి ముందు రోజు తనకు ఏదురైన అనుభవాన్ని మహారాష్ట్రలోని జల్నాకు చెందిన ఓ వ్యక్తి వివరించాడు.

Adarsh Raut

ముంబై, మే 01: పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో పలు కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రుషి భట్ అనే వ్యక్తి తాను జిప్‌లైన్ ఎక్కే సమయంలో దానిని అపరేట్ చేసే వ్యక్తి అల్లాహో అక్బర్.. అంటూ మూడు సార్లు బిగ్గరగా అరిచాడని.. అనంతరం కొద్ది సెకన్లకే పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఇప్పటికే ఎన్ఐఏ‌ అధికారులకు వివరించారు. తాజాగా మహారాష్ట్రలోని జల్నాకు చెందిన ఆదర్శ్ రౌత్ అనే యువకుడు సైతం స్పందించారు. దాడికి ఒక రోజు ముందు అంటే.. ఒక అనుమానిత ఉగ్రవాది తనతో మాట్లాడాడని గుర్తు చేసుకున్నారు. ఎన్ఐఏ విడుదల చేసిన ఉగ్రవాదుల ఊహా చిత్రాలను చూశాక తనకు ఆ అనుమానం మరింత బలపడిందని చెప్పారు.

ఏప్రిల్ 21వ తేదీ తాను పహల్గాంకు వెళ్లానని పేర్కొన్నారు. గుర్రపు స్వారీ చేసేందుకు వెళ్తున్న క్రమంలో బైసరన్ వ్యాలీలోని మ్యాగీ స్టాల్‌కు చేరుకున్నానన్నారు. అంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి.. నువ్వు హిందువా? అని ప్రశ్నించాడు. ఇంతలో మళ్లీ అతడే.. నీవు కాశ్మీర్‌కు చెందినవాడిలా లేవే అంటూ తనను ఆరా తీశాడన్నారు. ఆ తర్వాత తన పక్కనున్న వ్యక్తితో అతడు మాట్లాడాడని తెలిపారు. అయితే అతడు తనను ఇలా ఎందుకు అడుగుతున్నాడో తెలియక కొంత ఆందోళన కలిగిందని ఆదర్శ్ రౌత్ చెప్పారు. అదీకాక ఆ రోజు బైసరన్ గడ్డి మైదానంలో రద్దీ చాలా స్వల్పంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ అధికారులకు ఇప్పటికే ఈ మెయిల్ చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఆదర్స రౌత్‌ను సైతం ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది.


మరోవైపు ఈ ఉగ్రదాడిపై ఇప్పటికే ఎన్ఐఏ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుంది. అందులోభాగంగా మృతుల కుటుంబాలను కలుస్తోంది. ఉగ్రదాడి జరిగిన రోజు.. అసలేం జరిగిందంటూ ఆరా తీస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ భార్య సుజాతను సైతం ఎన్ఐఏ అధికారులు సుదీర్ఘంగా పలు ప్రశ్నలు వేసిన విషయం విధితమే. ఉగ్రవాదుల దాడిలో భరత్ భూషణ్ మరణించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

Pehalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం

Pakistan: పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం

For National News And Telugu News

Updated Date - May 01 , 2025 | 10:41 AM