NIA arrests: ముంబైలో ఇద్దరు ఐఎస్ సభ్యుల అరెస్ట్
ABN, Publish Date - May 18 , 2025 | 05:24 AM
ఐఎస్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు నిద్రాణ దళాలు మహారాష్ట్ర ఐఈడీ కేసులో నిందితులుగా ఉండగా, జకర్తాలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిపై రూ.3 లక్షల బహుమతి ప్రకటించిన నిఘా సంస్థ సార్వత్రికంగా సోదరులు.
న్యూఢిల్లీ, మే 17: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్ర సంస్థకు చెందిన నిద్రాణ దళాల(స్లీపర్ మాడ్యుల్)తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్ట్ చేసింది. అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్‌వాలా, తల్హా ఖాన్ 2023లో మహారాష్ట్రలోని పుణెలో ఐఈడీ తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసులో నిందితులు. రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. వీరిపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వీరి సమాచారం ఇచ్చిన వారికి ఎన్‌ఐఏ రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించింది. తాజాగా వీరిద్దరూ ఇండోనేషియా రాజధాని జకర్తాలో తలదాచుకుంటున్నట్లు సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ.. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సాయంతో అరెస్టు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్‌ఐఏ వీరిని అదుపులోకి తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 05:24 AM