Supreme Court: సుప్రీంకోర్టుకు జల జగడం
ABN, Publish Date - May 14 , 2025 | 05:47 AM
ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలపై సుప్రీంకోర్టు బుధవారం వాదనలు విననుంది. కేఆర్‌ఎంబీను రద్దు చేయాలని తెలంగాణ, విద్యుత్ ఉత్పత్తిపై ఆంక్షలు విధించాలన్న కోణంలో ఏపీ వ్యాజ్యం వేసాయి.
తెలంగాణ, ఏపీ వ్యాజ్యాలపై నేడు, రేపు విచారణ
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించిన కీలక కేసులు బుధ, గురువారాల్లో సుప్రీంకోర్టు ముందుకు రానున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో గోదావరి, కృష్ణా నది జలాల యాజమాన్య బోర్డులను నియమించారు. వీటిలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ తుది తీర్పు అమల్లోకి రానందున కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ను తాము గుర్తించడం లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసింది. కేఆర్‌ఎంబీని రద్దుచేయాలని అభ్యర్థించింది. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు తెలంగాణ, ఏపీల వాదనలను విననుంది. దిగువ రాష్ట్రాలకు జలాలు ఉపయోగపడే సమయంలోనే ఎగువ రాష్ట్రాలు జల విద్యుదుత్పత్తిని చేయాలన్న నిబంధనను ఉల్లంఘిస్తూ.. ఏపీకి నీటి అవసరాలు లేని సమయంలో జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ జలాలను దిగువకు వదిలేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని సుప్రీంకోర్టులో ఏపీ వ్యాజ్యం వేసింది. సాగర్, శ్రీశైలం జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తిపై ఆంక్షలు విధించాలని వ్యాజ్యంలో కోరింది. బుధవారం ఈ వ్యవహారంపై ఏపీ వాదనలు వినిపించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
Updated Date - May 14 , 2025 | 05:47 AM