ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mallikarjun Kharge: ముర్ము.. ముర్మా కోవింద్‌.. కోవిడ్‌

ABN, Publish Date - Jul 09 , 2025 | 03:05 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్లను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తప్పుగా పలికిన వీడియో వైరల్‌గా మారింది.

  • ప్రస్తుత, మాజీ రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే

రాయ్‌పూర్‌, జూలై 8: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్లను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తప్పుగా పలికిన వీడియో వైరల్‌గా మారింది. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సభలో ఖర్గే ప్రసంగించారు. ఆ రాష్ట్ర అడవుల్లో భారీ సంఖ్యలో చెట్ల కొట్టివేతను ప్రస్తావిస్తూ.. ‘‘మన నీళ్లు, అడవులు, భూములను రక్షించుకోవాలి. ఇందుకోసం మనం ఏకమవ్వాలి. మేం ముర్మా(ద్రౌపది ముర్ము)ను రాష్ట్రపతిని చేశామని బీజేపీ వాళ్లు చెబుతుంటారు..’ అని అన్నారు. వెంటనే ముర్ముజీ అని సరిదిద్దుకున్నారు. కొద్దిసేపటికే మళ్లీ.. కోవిడ్‌(రామ్‌నాథ్‌ కోవింద్‌)ను కూడా రాష్ట్రపతిని చేశామని చెబుతుంటారని వ్యాఖ్యానించారు. మన వనరులు, అడవులు, నీరు, భూమిని దోచుకోవడానికే వారికా పదవులు ఇచ్చారని చెప్పారు. అదానీ, అంబానీలాంటివారు వాటిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. ఖర్గే మహిళా వ్యతిరేకి అని.. ఆయన దళిత, గిరిజన వ్యతిరేక మనస్తత్వం బయటపడిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ధ్వజమెత్తారు.

Updated Date - Jul 09 , 2025 | 03:05 AM