ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Big Shock: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు..

ABN, Publish Date - May 27 , 2025 | 12:47 PM

Big Shock:చత్తీస్‌గడ్‌లో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. నలుగురు కీలక మావోయిస్టు నేతలతో పాటు మరో 18 మంది సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారికి పోలీసులు నియాద్ నెల్లా నార్ యోజన కింద పునరావాసం కల్పించనున్నారు.

Key Maoist Leaders Surrender

చత్తీస్‌గడ్: ఇటీవల జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మావోయిస్టులలో కలకలం మొదలైంది. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టు పార్టీకి భారీ షాక్ (Big Shock) తగిలింది. పలువురు మావోయిస్టు కీలక నేతలు (Key Maoist Leaders) సుక్మా (Sukma)లో పోలీసుల (Police) ఎదుట లొంగిపోయారు (Surrender). మావోయిస్టుల బెటాలియన్ వన్‌లో నలుగురు కీలక మావోయిస్టు నేతలతో పాటు మరో 18 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఇద్దరు నక్సలైట్లపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షలతో సహా మొత్తం రూ. 39 లక్షల రివార్డు ఉంది. సుక్మా, బీజపూర్ ప్రాంతంలో అనేక విధ్వంసక సంఘటనలలో మావోయిస్టులు పాల్గొన్నారు. కాగా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు పోలీసులు నియాద్ నెల్లా నార్ యోజన కింద పునరావాసం కల్పించనున్నారు.

Also Read: అందుకే కేటీఆర్‌కు నోటీసులు


కాగా మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు. 6 నెలలుగా మాడ్ ప్రాంతంలోనే నంబాల ఉన్నట్లు ప్రకటించారు. కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవలే లొంగిపోయారని మావోయిస్టులు ఆ లేఖలో తెలిపారు. వారిచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పుకొచ్చారు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటే ఆయన ఒప్పుకోలేదని, కేశవరావు కోసం 35 మంది ప్రాణాలు అడ్డుపెడితే ఏడుగురం సురక్షితంగా బయటపడ్డామని అన్నారు. 27 మంది ఎన్ కౌంటర్‌లో చనిపోయారని చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నించారు. స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో ఈ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె ఉధృతం..

నమ్మించి మోసం.. యువతి ఏం చేసిందంటే..

For More AP News and Telugu News

Updated Date - May 27 , 2025 | 12:47 PM