ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kerala Nurse Priya Case Update: యెమెన్‌లో కేరళ నర్సు‌కు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా..

ABN, Publish Date - Jul 15 , 2025 | 02:11 PM

యెమెన్‌లో కేరళ నర్సు‌ నిమిష ప్రియకు బిగ్ రిలీఫ్ దక్కింది. యెమెన్‌ ప్రభుత్వం ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది.

Nimisha Priya

ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌లో కేరళ నర్సు‌ నిమిష ప్రియకు బిగ్ రిలీఫ్ దక్కింది. యెమెన్‌ ప్రభుత్వం చివరిక్షణంలో ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. ప్రస్తుతం యెమెన్‌ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించడంతో రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే, నిమిష ప్రియకు ఎందుకు యెమెన్‌ దేశం ఉరి శిక్ష విధించింది? అసలేం జరిగింది అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

కేరళకు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ పూర్తి చేసి 2008లో యెమెన్ దేశానికి వెళ్లింది. అక్కడ కొన్నేళ్ళ పాటు పలు ఆస్పత్రుల్లో నర్సుగా పని చేసింది. ఈ నేపథ్యంలోనే 2014లో ఆమెకు స్థానికంగా ఉండే తలాల్ అబ్దో మహది అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. యెమెన్ దేశం రూల్స్ ప్రకారం .. నిమిషా తన క్లినిక్ బిజినెస్‌లో తలాల్ అబ్దోను భాగస్వామిగా చేర్చుకుంది. అయితే, క్లినిక్ ఓపెన్ చేసిన కొంత కాలానికే వారిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడికి జైలు శిక్ష పడింది. అయితే, అతడు జైలు నుండి విడుదైల ఆమెను టార్చర్ చేయడం మొదలెట్టాడు. ఆమె పాస్ పోర్టు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు.

ఇక రోజు రోజుకు అతడి వేధింపులు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయిన నిమిషా పాస్ పోర్టు తిరిగి తీసుకోవడానికి అతడిని చంపాలని ప్లాన్ వేసింది. 2017లో అతడికి ఇంజెక్షన్ వేసి చంపేసింది. అయితే, పాస్ పోర్టు తీసుకుని తిరిగి ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆమెను యెమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2017నుంచి ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ఆమెకు మరణ శిక్ష విధించింది. అయితే, మరణ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆమెకు ఉన్న ఒకే ఒక్క దారి ‘బ్లడ్ మనీ’. అంటే బాధితుడి కుటుంబం ఎంత డబ్బు అడిగితే అంత ఇవ్వడం. దీంతో నిమిషాను కాపాడ్డానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’కి కూడా సిద్ధమైంది.

అయితే, నిమిషా తరపు న్యాయవాది తనకు 40 వేల డాలర్ల ఫీజు ఇస్తేనే కేసు పరిష్కరిస్తానని లేదంటే లేదని తేల్చి చెప్పాడు. రెండు విడతలుగా డబ్బులు చెల్లించడానికి ప్రియ కుటుంబానికి అవకాశం ఇచ్చాడు. మొదటి విడత డబ్బులు ఇచ్చారు కానీ రెండో విడత డబ్బులు జమకూర్చే దగ్గర సమస్యలు వచ్చాయి. ఇలా 2024 సెప్టెంబర్ లో బ్లడ్ మనీ నిలిచిపోయింది. దీంతో నిమిషాకు ఈ నెల 16వ తేదిన ఉరి తేదీ ఖరారు చేశారు. అయితే, కేంద్రం ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు చేసి రేపు విధించాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా పడేలా చేసింది.

Updated Date - Jul 15 , 2025 | 02:56 PM