ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kamal Haasan: మీరేమైనా చరిత్రకారులా..

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:28 AM

కర్నాటక హైకోర్టు కమల్ హాసన్ చేసిన కన్నడపై అవమానాస్పద వ్యాఖ్యలకు కఠినంగా స్పందించి క్షమాపణ చెప్పాలని సూచించింది. కమల్ హాసన్ క్షమాపణ ఇవ్వకపోవడంతో వారి సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా వాయిదా వేసారు.

తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందన్న కమల్‌ హాసన్‌ను నిలదీసిన కర్ణాటక హైకోర్టు

క్షమాపణ చెప్పాలని సూచించిన జడ్జి

కమల్‌ ససేమిరా..

తన సినిమా ‘థగ్‌ లైఫ్‌’ను ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల చేయట్లేదని వెల్లడి

బెంగళూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కన్నడ భాషపై తానుచేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదాస్పదమైన నేపథ్యంలో.. రాష్ట్రంలో తన సినిమా ‘థగ్‌ లైఫ్‌’ విడుదలకు మార్గం సుగమం చేయాలని.. థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్‌ వేసిన సినీ హీరో కమల్‌ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ఇటీవల సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలకు మొదట క్షమాపణ చెప్పాలని సూచించింది. భాష ప్రతి వ్యక్తి సాంస్కృతిక, భావోద్వేగ గుర్తింపులో భాగమని.. తమిళం నుంచి కన్నడ పుట్టిందనే హక్కు కమల్‌కు ఎవరిచ్చారని న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్న ఈ సందర్భంగా నిలదీశారు. ‘ఇలాంటి ప్రకటన చేయడానికి మీరేమైనా చరిత్రకారులా.. లేక భాషావేత్తలా? ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారు? ఏ భాషా మరో భాష నుంచి పుట్టదు. నీరు, నేల, భాష ప్రజలకు పవిత్రమైనవి. భాష ప్రాతిపదికనే దేఽశంలో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మీరు చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. క్షమాపణ చెబితే సమస్య పరిష్కారమయ్యేది. మీరు కమల్‌ హాసన్‌ కావచ్చు.. ఇంకెవరైనా కావచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి వీల్లేదు. సి.రాజగోపాలాచారి కూడా 75 ఏళ్ల కిందట ఇలాంటి ప్రకటనే చేసి.. తర్వాత క్షమాపణ చెప్పారు. మరి మీరెందుకు చెప్పరు? సినిమా విడుదల ద్వారా కర్ణాటకలో రూ.కోట్లు ఆర్జించాలని భావిస్తున్నారు. కానీ క్షమాపణ చెప్పరా? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సాధారణ పౌరులను కూడా శిక్షిస్తాం. మీరేమైనా ఇందుకు మినహాయింపా’ అని ఆక్షేపించారు. పరిస్థితి సద్దుమణిగేలా చేయడానికి క్షమాపణ చెప్పే విషయం ఆలోచించాలని కమల్‌కు సూచించారు. మధ్యాహ్నం 2.30 వరకు విచారణను వాయిదావేశారు. విచారణ పునఃప్రారంభమయ్యాక.. క్షమాపణ చెప్పడానికి కమల్‌ హాసన్‌ నిరాకరించారు. ప్రస్తుతానికి ఆ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని కమల్‌, ఆయన నిర్మాణ సంస్థ నిర్ణయించినట్లు వారి లాయర్‌ తెలిపారు. కేఎ్‌ఫసీసీతో చర్చలు జరిపేదాకా విడుదల ఆపేస్తామన్నారు. క్షమాపణ చెప్పడానికి కమల్‌ నిరాకరించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. విచారణను 10వ తేదీకి వాయిదావేసింది.


తప్పుగా అర్థం చేసుకున్నారు..

తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కేఎ్‌ఫసీసీ అధ్యక్షుడు నరసింహులుకు కమల్‌హాసన్‌ ప్రత్యేకంగా లేఖ రాశారు. కన్నడ భాషపై తనకు అగౌరవం లేదని, అభిమానం ఉందని తెలిపారు. తమిళం, కన్నడ, తెలుగు, మళయాళం సహా ఈ గడ్డపై ఉన్న అన్ని భాషలతో తనకు అనుబంధం ఉందన్నారు. తనపై ఉన్న ప్రేమ, అనుబంధంతో శివణ్ణ (శివరాజ్‌కుమార్‌) కూడా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చారని, తన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై బీజేపీ సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. శాంతి, సామరస్యానికి భంగం కలిగించేలా, కోట్లాదిమంది కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన చిన్నవారైపోరని ‘ఎక్స్‌’లో అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:29 AM