ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karnataka Rabies Death: వీధి కుక్క కరవడంతో రేబిస్ వ్యాధి.. కర్ణాటకలో చిన్నారి మృతి

ABN, Publish Date - Aug 19 , 2025 | 01:50 PM

కర్ణాటక దెవనగరి జిల్లాలో నాలుగు నెలల క్రితం కుక్క దాడిలో గాయపడ్డ నాలుగు ఏళ్ల చిన్నారి బెంగళూరులో చికిత్స పొందుతూ దుర్మరణం చెందింది.

Karnataka Rabies Death

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం వీధి కుక్క కరవడంతో రేబిస్ బారిన పడ్డ ఓ నాలుగేళ్ల బాలిక మంగళవారం కన్నుమూసింది. బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

దేవనగరికి చెందిన బాలిక ఏప్రిల్‌ నెలలో తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసింది. ముఖం, ఇతర భాగాలను కరవడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే బాలిక కుటుంబం చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించి ఆపై మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పలు ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోయింది. రేబిస్ బారిన పడ్డ బాలిక చివరకు కన్నుమూసింది. దీంతో, వీధి కుక్కల అంశం మరోసారి స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది.

అంతకుముందు, కర్ణాటక లోకాయుక్త జస్టిస్ బీఎస్ పాటిల్.. బెంగళూరు నగరపాలక సంస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీధి కుక్కల సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. కుక్కల కోసం ప్రత్యేక షెల్టర్‌లు నిర్మించడంలో నగర పాలక సంస్థ విఫలమైందని పేర్కొంది.

ఢిల్లీలోని వీధి కుక్కల బెడదలపై సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లోని కుక్కలను వెంటనే షెల్టర్‌లకు తరలించాలని ఆదేశించింది. రేబిస్ కేసులు, కుక్క కాటుతో మరణాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యలకు అడ్డుపడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జంతుప్రేమికులు ఈ తీర్పును న్యాయపరంగా సవాలు చేశారు. కొందరు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో మరో సుప్రీం కోర్టు బెంచ్ ఈ అంశంపై దృష్టి సారించింది. ఈ అంశంలో జంతుప్రేమికులు దాఖలు చేసిన పిటిషన్‌లను విచారణకు స్వీకరించింది.

ఇవి కూడా చదవండి

షాకింగ్ ఘటన.. మద్యం మత్తులో ఆటోడ్రైవర్.. మహిళా పోలీసును రోడ్డుపై ఈడ్చుకెళ్లి...

ముంబైలో కుండపోత వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

For More National News and Telugu News

Updated Date - Aug 19 , 2025 | 02:02 PM