Satara Cop: షాకింగ్ ఘటన.. మద్యం మత్తులో ఆటోడ్రైవర్.. మహిళా పోలీసును రోడ్డుపై ఈడ్చుకెళ్లి...
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:22 AM
మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన ఆటోకు వేలాడుతున్న మహిళా పోలీసును ఓ ఆటో డ్రైవర్ ఏకంగా 120 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. స్థానికులు వెంటనే ఆటోను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సతారా జిల్లాలో ఈ దారుణం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని సతారాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ మహిళా పోలీసును రోడ్డుపై సుమారు 120 మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఆటోకు మహిళ వేలాడుతున్నా పట్టించుకోకుండా అతడు వాహనాన్ని తోలడంతో ఆమె గాయాలపాలయ్యారు. ఖండోబా మాల్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది.
ఆటోలో అటువైపు వస్తున్న దేవరాజ్ కాలేను వాహనం ఆపమని మహిళా పోలీసుల భాగ్యశ్రీ జాదవ్ కోరారు. చెకింగ్ కోసం ఆటోఆపమని సైగ చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు ఆటో ఆపకుండా ఆమెను దాదాపు 120 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చు కెళ్లాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆటోను ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. కానిస్టేబుల్‌ను కాపాడిన స్థానికులు ఆటో డ్రైవర్‌కు దేహ శుద్ధి చేశారు. ఆ తరువాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయాల పాలైన మహిళా పోలీసు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
ట్రాక్స్ మధ్య సోలార్ ప్యానెల్స్.. రైల్వే శాఖ వినూత్న ప్రాజెక్టు.. ఎక్కడంటే..
దేవుడా.. పులులున్న అడవిలో పర్యాటకులను వదిలి పారిపోయిన గైడ్
For More National News and Telugu News