ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hair Transplant Horror: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దారుణం.. మరో ఇంజనీర్ బలి..

ABN, Publish Date - May 15 , 2025 | 07:41 AM

Hair Transplant Horror: ఎంపైర్ క్లినిక్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు. సర్జరీ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న తర్వాత తీవ్రమైన తలనొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు.డాక్టర్ ఇంజెక్షన్ వేసినా .. ఎలాంటి లాభం లేకుండా పోయింది. మరుసటి రోజు అతడి ముఖం మొత్తం వాచిపోయింది.

Hair Transplant Horror

మగాళ్లు కావచ్చు.. ఆడవాళ్లు కావచ్చు.. జట్టుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జుట్టు ఉంటే మనిషి అందంగా కనిపిస్తాడనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాస్తవానికి మనిషికి జుట్టు అనేది ఓ బలహీనత లాంటిది. అందుకే కొన్ని కంపెనీలు జుట్టును వ్యాపారంగా మార్చుకుని లక్షలు.. కోట్లు గడిస్తున్నాయి. నూటికి 70 శాతం మంది మగాళ్లను బట్టతల సమస్య వేధిస్తోంది. కొన్ని రకాల బట్టతలలను మందులు, లిక్విడ్ల ద్వారా నయం చేయవచ్చు. అయితే, మరికొన్నిటికి మాత్రం ట్రాన్స్‌ప్లాంటేషన్ చివరి ఆప్షన్ అవుతోంది. ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో సక్సెస్ రేటు ఎక్కువగానే ఉంటుంది.


కానీ, అత్యంత అరుదుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రాణాలు పోతూ ఉంటాయి. అది కూడా ఆస్పత్రిని బట్టి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన మయాంక్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తూ ఉన్నాడు. త్వరలో సొంతంగా ఓ బిజినెస్ స్టార్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నాడు. బట్టతల కారణంగా నలుగురిలో తిరగడానికి అతడు ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం నవంబర్ 18వ తేదీన ఎంపైర్ క్లినిక్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాడు. సర్జరీ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న తర్వాత తీవ్రమైన తలనొప్పి వచ్చింది.


వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్ ఇంజెక్షన్ వేసినా .. ఎలాంటి లాభం లేకుండా పోయింది. మరుసటి రోజు అతడి ముఖం మొత్తం వాచిపోయింది. గుండెల్లో నొప్పి కూడా మొదలైంది. మళ్లీ ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు గుండెలో ఎలాంటి సమస్య లేదని తేల్చారు. అయితే, ఊహించని విధంగా నవంబర్ 19వ తేదీన అతడు చనిపోయాడు. దాదాపు 6 నెలలుగా మయాంక్ తల్లి న్యాయం కోసం పోరాడుతోంది. ఆ పోరాటం ఫలించింది. గత మంగళవారం పోలీసులు మయాంక్ మరణంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎంపైర్ క్లినిక్ కారణంగా చనిపోయిన వారిలో మయాంక్ రెండో వ్యక్తి కావటం గమనార్హం. గతంలో వినీత్ దూబె అనే ఇంజనీర్ చనిపోయాడు. మయాంక్‌కు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన డాక్టర్ అనుష్క పరారీలో ఉంది.


ఇవి కూడా చదవండి

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు

2 Women Marry: ఎంత మోసపోతే మాత్రం.. ఇలా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా..

Updated Date - May 15 , 2025 | 11:21 AM