ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kangana Ranaut: యుద్ధం వల్ల కాదు.. ఇలాంటి వారి వల్లే దేశానికి ప్రమాదం: కంగనా రనౌత్ ఆగ్రహం

ABN, Publish Date - May 12 , 2025 | 11:40 AM

గత వారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఓ వీడియో చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఆ వీడియోలోని అమ్మాయిలు మన దేశ రాష్ట్రపతి పేరును కూడా చెప్పలేకపోయారు. పేరు చెప్పలేకపోతే పోయారు.. మన రాష్ట్రపతి ఓ మహిళ అనే విషయం కూడా వారికి తెలియకపోవడం అత్యంత దారుణమైన విషయం.

Kangana Ranaut fires on youngsters failing to name President of India

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నేటి యువతకు అత్యంత ముఖ్యమైన విషయాలపై కూడా పరిజ్ఞానం ఉండడం లేదు. కనీస పరిజ్ఞానం లేకుండా రోజులు గడిపేస్తున్నారు. గత వారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఓ వీడియో చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఆ వీడియోలోని అమ్మాయిలు మన దేశ రాష్ట్రపతి (President of India) పేరును కూడా చెప్పలేకపోయారు. పేరు చెప్పలేకపోతే పోయారు.. మన రాష్ట్రపతి ఓ మహిళ అనే విషయం కూడా వారికి తెలియకపోవడం అత్యంత దారుణమైన విషయం (Viral Video).


బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) దృష్టికి కూడా ఆ వీడియో వెళ్లింది. ఆ వీడియో చూసిన కంగన తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో యాంకర్ ఇద్దరమ్మాయిలను మన రాష్ట్రపతి ఎవరు అని ప్రశ్నించింది. దానికి ఓ అమ్మాయి సమాధానం ఇస్తూ.. అతని పేరును తను మర్చిపోయానని చెప్పింది. అలాగే పక్కనే ఉన్న అమ్మాయి.. మృణాళి లేదా మురును అని చెప్పింది.


ఆ వీడియోపై కంగన స్పందిస్తూ.. మన దేశానికి యుద్ధం వల్ల కాదు.. ఇలాంటి బ్రెయిన్‌తో ఉన్న వారి వల్లే ప్రమాదం అంటూ కామెంట్ చేసింది. ఇక, మరో వ్యక్తిని అడగ్గా.. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు కాకుండా రామ్‌నాథ్ కోవింద్ పేరు చెప్పారు. కాగా, కంగన ప్రస్తుతం తన హాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమవుతోంది. బ్లెస్డ్ బీ ది ఎవిల్ అనే హారర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2025 | 12:06 PM