ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu and Kashmir: కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. షెడ్‌లో దాక్కున్న టెర్రరిస్ట్‌లను చూశారా..

ABN, Publish Date - May 15 , 2025 | 03:56 PM

పెహల్గామ్ దాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవేట ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందుకున్న భారత సైన్యం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఎన్‌కౌంటర్లు కూడా జరుగుతున్నాయి.

Army

పెహల్గామ్ దాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవేట ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందుకున్న భారత సైన్యం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఎన్‌కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. గురువారం ఉదయం అవంతిపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు సైన్యం చేతిలో హతమయ్యారు. సైన్యం డ్రోన్ల ద్వారా తీవ్రవాదులను గాలిస్తోంది.


తాజా ఎన్‌కౌంటర్‌కు ముందు డ్రోన్ ద్వారా చిత్రీకరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ షెడ్‌లోని కాంక్రీట్ పిల్లర్ వెనుక దాక్కున్న తీవ్రవాది కనబడుతున్నాడు. అతడి చేతిలో రైఫిల్ ఉంది. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న అవంతిపొరాలోని ఓ ఇంట్లో దాక్కున్న ముగ్గురినీ గురువారం ఉదయం సైన్యం, జమ్ము, కశ్మీర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ ద్వారా హతమార్చారు.


ఈ ముగ్గురు జైషే మహ్మద్ ముఠాకు చెందిన సభ్యులుగా భావిస్తున్నారు. ఇక, గత మంగళవారం సోఫియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గరు టెర్రరిస్ట్‌లను సైన్యం చంపేసిన సంగతి తెలిసిందే. వీరు లష్కరే తొయిబా‌కు చెందిన తీవ్రవాదులని సైన్యం భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 15 , 2025 | 05:05 PM