ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IRCTC Aadhaar link: ఐఆర్‌సీటిసీ అలర్ట్.. ఆధార్‌తో అనుసంధానించని ఖాతాలు త్వరలో బంద్..

ABN, Publish Date - Jun 07 , 2025 | 05:56 PM

భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్‌సీటిసీ (IRCTC Aadhaar link) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

IRCTC Aadhaar link

భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కీలక చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆధార్‌తో (IRCTC Aadhaar link) అనుసంధానం లేని ఐఆర్‌సీటిసీ ఖాతాలను త్వరలో మూసివేయనున్నట్లు హెచ్చరించింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం, టికెట్ బుకింగ్‌లో అక్రమ పద్ధతులను ఉపయోగిస్తున్న కోట్లాది అనుమానాస్పద ఖాతాలను గుర్తించడమే. ఇటీవల రైల్వే అధికారుల పరిశీలనలో చాలా టికెట్లు ఆటోమేటెడ్ టూల్స్ లేదా బాట్‌ల ద్వారా బుక్ అవుతున్నట్లు తేలింది.


ఆధార్ ధృవీకరణ..

ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గత ఆరు నెలల్లో 2.4 కోట్ల అనుమానాస్పద ఖాతాలను ఐఆర్‌సీటీసీ రైల్వే బ్లాక్ చేసింది. అదనంగా 20 లక్షల ఖాతాలు ఆధార్ ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం ఐఆర్‌సీటిసీలో 13 కోట్ల యాక్టివ్ యూజర్లలో 1.2 కోట్ల ఖాతాలు మాత్రమే ఆధార్ ధృవీకరణ పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటిసీ అందరూ యూజర్‌లను తమ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయాలని కోరుతోంది. ఒకవేళ ఆధార్ ధృవీకరణ చేయకపోతే, వారిని అనుమానాస్పదంగా గుర్తించి, వారి ఖాతాలను బ్లాక్ చేస్తుంది.


ఇటీవల అనుమానాస్పద కార్యకలాపాలు

ప్రతి రోజూ దాదాపు 2.25 లక్షల మంది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్నారు. మే 24 నుంచి జూన్ 2 వరకు జరిగిన టికెట్ బుకింగ్‌లపై ఇటీవల నిర్వహించిన అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. ఏసీ, నాన్-ఏసీ తత్కాల్ టికెట్లు బుకింగ్ విండో తెరిచిన తొలి 10 నిమిషాల్లోనే ఎక్కువగా బుక్ అయ్యాయి. ఏసీ తత్కాల్ టికెట్లు మొత్తం 1.08 లక్షల టికెట్లలో తొలి నిమిషంలో 5,615 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి.


నిమిషాల్లోనే..

కానీ, రెండో నిమిషంలో ఈ సంఖ్య 22,800కి పెరిగింది. మొత్తం 62.5 శాతం టికెట్లు తొలి 10 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. అయితే 3 శాతం టికెట్లు 10 గంటల తర్వాత కూడా బుక్ అయినట్లు గమనించారు. నాన్-ఏసీ తత్కాల్ టికెట్లు రోజూ సగటున 1.18 లక్షల టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. ఇందులో 4 శాతం తొలి నిమిషంలో, 17.5 శాతం రెండో నిమిషంలో, 66.4 శాతం తొలి 10 నిమిషాల్లో బుక్ అవుతున్నట్లు గుర్తించారు. కానీ ఇవి బాట్‌ల ద్వారా బుక్ అవుతున్నట్లు గుర్తించారు.


తత్కాల్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

  • తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు రైల్వే మరికొన్ని కఠిన నిబంధనలను అమలు చేయనుంది

  • ఆన్‌లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఆధార్ ధృవీకరణ ఉన్న ఖాతాలు మాత్రమే అనుమతించబడతాయి

  • బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు

  • అంతేకాదు కౌంటర్ ద్వారా తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ ధృవీకరణ అవసరం కావచ్చని సమాచారం

  • ఆధార్ లింకింగ్ ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు అక్రమ బుకింగ్‌లను నియంత్రించనున్నారు


ఇవీ చదవండి:

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..


ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2025 | 06:12 PM