Iran Mediation: భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధం
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:31 AM
పాక్ ప్రధాని షెహబాజ్ షరీ్‌ఫతో శనివారం ఫోన్‌లో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ ఈ విషయాన్ని తెలిపారు. పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలుపుకొన్న ఇరువురు నేతలు ముస్లిం దేశాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
ఇరాన్ ప్రకటన.. స్వాగతించిన పొరుగు దేశం
న్యూఢిల్లీ, జూన్ 8: భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ ప్రకటించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీ్‌ఫతో శనివారం ఫోన్‌లో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ ఈ విషయాన్ని తెలిపారు. పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలుపుకొన్న ఇరువురు నేతలు ముస్లిం దేశాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అనంతరం భారత్-పాక్ సంబంధాలపై మాట్లాడారు. ‘ఉద్రిక్తతలు తగ్గి ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఇస్లామిక్ రాజ్యాల్లో శాంతి నెలకొనాలన్న సిద్ధాంతపర విధానంపై ఇరాన్ దృష్టి కేంద్రీకరించిన’ట్టు పెజెష్కియన్ తెలిపారు. భారత్-పాక్‌ల మధ్య చిరకాల శాంతి నెలకొనేలా జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ స్వాగతిస్తుందని, అందులో భాగంగా రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వ పాత్రను కూడా పోషించగలదని చెప్పారు. పాక్‌లో పర్యటించాలని షరీఫ్ కోరగా అందుకు ఆయన అంగీకరించారు. తర్వాత షరీఫ్ మాట్లాడుతూ భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతల్లో ఇరాన్ అనుసరిస్తున్న వైఖరిని ప్రశంసించారు. భారత్‌తో చర్చలు జరపాలనే తాము కోరుకుంటున్నామని, ఇరాన్ మధ్యవర్తిత్వం వహిస్తే స్వాగతిస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 05:31 AM