ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rail One App: రైలు సేవలన్నీ ఒకే చోట

ABN, Publish Date - Jul 02 , 2025 | 05:44 AM

రైల్వే సేవలను ప్రయాణికులు మరింత సులభం పొందేందుకు వీలుగా ఆ శాఖ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘రైల్‌ వన్‌’ పేరిట రూపొందించిన ఈ యాప్‌ ద్వారా అన్ని సేవలను ఒకే చోట పొందేందుకు వీలుకలుగుతుంది.

Indian Railways
  • సరికొత్తగా ‘రైల్‌ వన్‌’ యాప్‌

  • రిజర్వేషన్‌, ప్లాట్‌ఫాం టికెట్‌ సహా..

  • అన్ని సేవలు అందుబాటులో

న్యూఢిల్లీ, జూలై 2: రైల్వే సేవలను ప్రయాణికులు మరింత సులభం పొందేందుకు వీలుగా ఆ శాఖ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘రైల్‌ వన్‌’ పేరిట రూపొందించిన ఈ యాప్‌ ద్వారా అన్ని సేవలను ఒకే చోట పొందేందుకు వీలుకలుగుతుంది. టికెట్ల బుకింగ్‌, రిజర్వేషన్‌, టికెట్ల రద్దు, ప్లాట్‌ఫాం టికెట్లు, భోజనం సహా ఫిర్యాదులు, సమస్యలు వంటి అన్ని రకాల సేవలు ఈ యాప్‌లో ఒకే చోట అందుబాటులో ఉంటాయి. పీఎన్‌ఆర్‌ విచారణ, జర్నీ ప్లానింగ్‌ వంటివి కూడా ఈ యాప్‌లో ఉంటాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్లు వినియోగించేవారు ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌(సిఆర్‌ఐఎస్‌) 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంగళవారం ఈ యాప్‌ను ఆవిష్కరించారు.

రైల్‌ వన్‌ యాప్‌ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌గా ప్రయాణికులకు ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. ఈ యాప్‌ ద్వారా టికెట్‌ రిజర్వేషన్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు, ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలు, పీఎన్‌ఆర్‌ ఎంక్వయిరీ, జర్నీ ప్లానింగ్‌, రైల్వే స్టేషన్లలో బోగీల పొజిషన్‌, రైలు ప్రయాణ స్థితి, రైలు సహాయ సేవలు, ప్రయాణ సమయంలో మీల్స్‌ బుకింగ్‌వంటి పలు సేవలను ఒకే వేదిక ద్వారా పొందవచ్చన్నారు. గతంలో పలు సేవలకు వేర్వేరు యాప్‌లు ఉండేవని.. దీంతో వినియోగదారులు అనేక పాస్‌వర్డ్స్‌, లాగిన్‌లను వినియోగించాల్సి వచ్చేదని, కానీ.. రైల్‌ వన్‌లో ఒకే లాగిన్‌, ఒకే పాస్‌వర్డ్‌తో అన్ని సేవలను సులభంగా పొందవచ్చని మంత్రి వైష్ణవ్‌ వివరించారు. ఈ యాప్‌కు రైల్వే ఈ-వ్యాలెట్‌ను కూడా జోడించినట్టు తెలిపారు. లాగిన్‌ అయ్యేందుకు బయోమెట్రిక్‌ సహా ‘ఎంపిన్‌’ సౌలభ్యం ఉందన్నారు. ‘సూపర్‌ యాప్‌’గా ఇది రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తుందని తెలిపారు.

Updated Date - Jul 02 , 2025 | 01:15 PM