ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Deportation: అమెరికా ఇప్పటివరకూ 1080 మంది భారతీయుల్ని డిపోర్టు చేసింది: విదేశాంగ శాఖ

ABN, Publish Date - May 30 , 2025 | 09:33 AM

జనవరి నుంచి ఇప్పటివరకూ అమెరికా 1080 మంది భారతీయులను స్వదేశానికి పంపించిందని భారత విదేశాంగ శాఖ తాజాగా పేర్కొంది. వీరిలో 62 శాతం మంది కమర్షియల్ విమానాల ద్వారా తిరిగొచ్చారని వెల్లడించింది.

Indian deportation US

అక్రమ వలసల అంశం పరిష్కారానికి భారత్ అమెరికాతో కలిసి పనిచేస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం మొత్తం 1080 మంది భారతీయులను స్వదేశానికి పంపించిందని అన్నారు. వీరిలో సుమారు 62 శాతం మంది కమర్షియల్ విమానాల్లో భారత్‌కు చేరుకున్నారని తెలిపారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన విదేశీయులకు సంకెళ్లు వేసి మరీ అమెరికా ప్రభుత్వం స్వదేశాలకు పంపించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.


ఇక హార్వర్డ్ యూనివర్సిటీ, ట్రంప్ ప్రభుత్వం మధ్య వివాదం గురించి కూడా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. స్టూడెంట్ వీసాలు, ఎక్సేంజ్ విజిటర్ వీసాలపై అమెరికా జారీ చేసిన మార్గదర్శకాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. విదేశాల్లోని భారతీయుల భద్రతకే కేంద్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ విషయంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. వీసాల జారీ అనేది ఆయా దేశాల సార్వభౌమ అధికారమని ఆయన వెల్లడించారు. అయితే, భారతీయ విద్యార్థుల దరఖాస్తులను మెరిట్‌గా పరిగణనలోకి తీసుకుని, సకాలంలో కోర్సుల్లో చేరేలా చర్యలు తీసుకుంటుందని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు.


వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ పరిశీలించిన అనంతరం వీసాలు జారీ చేసే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను ఆదేశించారు. దీంతో, అమెరికా యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు కష్టతరంగా మారాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఎటువంటి వీసా ఇంటర్వ్యూలు ఉండవని మంత్రి రూబియో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నాలకు కోర్టుల్లో చుక్కెదురవుతోంది.

ఇవీ చదవండి:

ఆపరేషన్ సిందూర్‌తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 09:39 AM