Shubhanshu Shukla: అంతరిక్షంలోకి శుభాంశు..మొదటి సందేశం ఇదే..
ABN, Publish Date - Jun 25 , 2025 | 04:14 PM
Indian Astronaut Shubhanshu Shukla: దాదాపు 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి చేరుకున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డు సృష్టించాడు. ఐఎస్ఎస్‌కు చేరుకున్న తర్వాత శుభాంశు శుక్లా మొదటి సందేశాన్ని పంపారు.
కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన యాక్సియమ్-4 అంతరిక్షయానం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నాసాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఆకాశంలోకి దూసుకెళ్లిన 8 నిమిషాల్లోనే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేసింది. భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌లో ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు
దాదాపు 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి చేరుకున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డు సృష్టించాడు. ఐఎస్ఎస్‌కు చేరుకున్న తర్వాత శుభాంశు శుక్లా మొదటి సందేశాన్ని పంపారు. ఆ సందేశంలో.. ‘నా ప్రియమైన భారతీయులకు నమస్కారం. చాలా కాలం తర్వాత మనం మళ్లీ అంతరిక్షంలోకి వచ్చేశాం. ప్రయాణం అద్భుతంగా ఉండింది. నాతో పాటు నా భుజాలకు మూడు రంగుల జెండా ఉంది. జై హింద్, జై భారత్’ అని పేర్కొన్నారు.
ప్రయాణానికి ముందు భావోద్వేగం
యాక్సియమ్-4 మిషన్ మొదలవ్వడానికి ముందు శుంభాశు శుక్లా.. భార్య కామ్నా శుభను ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. 'అద్భుతమైన భాగస్వామిగా ఉన్నందుకు కామ్నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నువ్వు లేకుండా ఇవేవీ సాధ్యం అయ్యేవి కావు’ అని పేర్కొన్నారు. కాగా, 1983 ఏప్రిల్ 3వ తేదీన రాకేష్ శర్మ మొదటి సారి ఇండియా నుంచి అంతరిక్షయానం చేశారు. దాదాపు ఎనిమిది రోజుల పాటు కక్ష్యలో ఉన్నారు. ‘అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తోందని’ అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆయన్ని అడగ్గా.. ‘సారే జహాన్ సే అచ్చా(ఈ ప్రపంచం కంటే ఎంతో అద్భుతంగా భారత్ కనిపిస్తోంది)’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న మహిళలు.. ఇంతలోనే అనుకోని విషాదం..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో Mల మధ్యనున్న Nను 5 సెకెన్లలో కనిపెట్టండి
Updated Date - Jun 25 , 2025 | 04:36 PM