Viral Video: సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న మహిళలు.. ఇంతలోనే అనుకోని విషాదం..
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:14 PM
Wedding Celebration Turns Tragic: గత వారం ఆగ్రాలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపై మామిడి పండ్లు తీసుకెళుతున్న వాహనం దూసుకెళ్లింది. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
ఓ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకలో భాగంగా.. కొంతమంది మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి రోడ్డుపై డ్యాన్స్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఓ కారు పెళ్లి గుంపుపైకి దూసుకువెళ్లింది. దీంతో మహిళలు, మగాళ్లు, చిన్న పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రాలోని సికంద్రా థానా ఏరియాలో ఓ పెళ్లి వేడుక జరుగుతూ ఉంది. పెళ్లి వేడుకలో భాగంగా కొంతమంది మహిళలు రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.
పక్కనే ఉన్న వారంతా చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడి వాతావరణం మొత్తం అరుపులు, కేరింతలతో ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎర్రని దుస్తులు ధరించిన మహిళ ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇంతలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది. మారుతీ ఎకో కారు వేగంగా వారివైపుకు దూసుకు వచ్చింది. డ్యాన్స్ వేస్తున్న వారిని ఢీకొట్టింది. జనాలను ఢీకొట్టిన తర్వాత వాహనం ఆగలేదు. వారిపైనుంచి ముందుకు దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై ది ఆగ్రా పోలీస్ కమిషనరేట్ స్పందించింది. సికంద్ర స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఆదేశాలు జారీ చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ కోసం అన్వేషణ ప్రారంభించారు. కాగా, గత వారం ఆగ్రాలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపై మామిడి పండ్లు తీసుకెళుతున్న వాహనం దూసుకెళ్లింది. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఆ వాహనం బోల్తా పడటంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇవి కూడా చదవండి
దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి..
ముంబై మెట్రో కోచ్‌లో పొగలు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి