ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Astronaut: త్వరలో అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా..

ABN, Publish Date - Jun 14 , 2025 | 01:52 PM

Indian Astronaut Shubhanshu Shukla: త్వరలో ఫాల్కన్ 9 రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళుతున్న శుభాన్షు శుక్లాకు మాజీ నాసా ఆస్ట్రోనాట్ 64 ఏళ్ల డాక్టర్ విట్సన్ సాకారం అందిస్తున్నారు.

Indian Astronaut

ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూపు కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 19వ తేదీన ఆయన అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు. ఫాల్కన్ 9 రాకెట్‌లో ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అక్కడే 14 రోజుల పాటు ఉండనున్నారు. ఈ రాకెట్ గత నెలలోనే అంతరిక్షంలోకి వెళ్లాల్సి ఉండింది. అయితే, పలు కారణాల వల్ల ఐదు సార్లు ప్రయాణం వాయిదా పడింది.

అన్ని అవరోధాలను దాటుకుని మరికొన్ని రోజుల్లో ఫాల్కన్ 9 అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. ఫాల్కన్ 9 అంతరిక్ష ప్రయాణంపై ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. ‘ఫాల్కన్ 9లో లిక్విడ్ ఆక్సిజన్ లీకేజ్ సమస్య ఉందని గుర్తించాము. దాన్ని సరిచేశాము. జూన్ 19వ తేదీన ఫాల్కన్ అంతరిక్షంలోకి వెళ్లనుంది’ అని పేర్కొంది.

శుక్లాకు డాక్టర్ విట్సన్ సాకారం..

త్వరలో ఫాల్కన్ 9 రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళుతున్న శుభాన్షు శుక్లాకు నాసా మాజీ ఆస్ట్రోనాట్ 64 ఏళ్ల డాక్టర్ విట్సన్ సాకారం అందిస్తున్నారు. డాక్టర్ విట్సన్‌కు 650 రోజులు అంతరిక్షంలో ఉన్న అనుభవం ఉంది. ఆమె శుభాన్షుకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఒక వేళ శుభాన్షు విజయవంతంగా అంతరిక్షంలోకి వెళితే.. ఆయన పేరిట రికార్డు నెలకొననుంది. భారతదేశం నుంచి అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. 1984లో మొదటి సారి భారత్‌కు చెందిన రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు.

ఇవి కూడా చదవండి

హాస్టల్‌పై పడ్డ విమానం.. వెలుగులోకి భయానక దృశ్యాలు..

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు..

Updated Date - Jun 14 , 2025 | 02:17 PM