ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఆర్మీ

ABN, Publish Date - May 18 , 2025 | 02:19 PM

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి.

Operation Sindoor

ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఇండియన్ ఆర్మీ మరో వీడియో విడుదల చేసింది. వెస్ట్రన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ ఆదివారం ఆ వీడియోను తమ ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘ ప్లాన్డ్, ట్రైన్డ్, ఎగ్జిక్యూటెడ్.. జస్టిస్ సర్వ్డ్’ అని పేర్కొంది. ఆ వీడియోలో ఓ జవాన్ మాట్లాడుతూ.. ‘ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్‌తో ఇదంతా మొదలైంది. ఆగ్రహం భగభగ మండే లావా లాగా ఉండింది. మా అందరిలో ఒకే ఆలోచన.. గుణ పాఠం చెప్పాలి. అది కూడా తరతరాలకు గుర్తుండి పోయేలా గుణ పాఠం చెప్పాలి. మేము పగతో అదంతా చేయలేదు. న్యాయం కోసం మాత్రమే చేశాం’ అని అన్నాడు.


ఆ వీడియో గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంది. సోషల్ మీడియాలో సైతం వీడియో వైరల్‌గా మారింది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి.

మొత్తం 9 స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. భారత ఆర్మీ ఎంతో విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తి చేయటం వెనుక చాలా కష్టం ఉంది. పక్కా ప్లాన్‌తో పాటు వెల్ ఎగ్జిక్యూషన్‌తో ఆర్మీ అద్భుతమైన ఫలితాలను రాబట్టింది.


ఇవి కూడా చదవండి

Russian Dream Teacher: విద్యార్థితో అసభ్య ప్రవర్తన.. అలాంటి ఫొటోలు పంపి..

Fire Accident In Charminar: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. ఇలా జరిగింది..

Updated Date - May 18 , 2025 | 02:22 PM