ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Interim Trade Agreement: నాన్‌ వెజ్‌ పాలకు నో

ABN, Publish Date - Jul 16 , 2025 | 05:47 AM

ట్రంప్‌ సుంకాల గోల వేళ భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఇరుదేశాల మధ్య సుదీర్ఘంగా జరుగుతున్న చర్చలు తాజాగా ఓ కొలిక్కి...

భారత్‌, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి?

  • చాలా వరకు భారత ఉత్పత్తులపై 10 కనీస సుంకం.. కొన్నింటిపై కాస్త అధికం

  • అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 5 నుంచి 8 శాతం వరకు భారత్‌ సుంకాలు

న్యూఢిల్లీ, జూలై 15: ట్రంప్‌ సుంకాల గోల వేళ భారత్‌-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఇరుదేశాల మధ్య సుదీర్ఘంగా జరుగుతున్న చర్చలు తాజాగా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. చాలా వరకు ఉత్పత్తుల విషయంలో ఇంతకుముందే పరస్పరం సానుకూలత వ్యక్తమైనా.. వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు అనుమతి, సుంకాల తగ్గింపుపై భారత్‌ గట్టి నిలబడింది.

భారత్‌లో ఈ రంగాలపై ఆధారపడిన కోట్లాది మంది ప్రయోజనాలు దెబ్బతింటాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా నుంచి ‘నాన్‌ వెజ్‌’ పాల దిగుమతిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని పేర్కొంది. అమెరికాలో ఆవులు, గేదెలకు కోళ్లు, చేపలు, ఇతర పశువులకు సంబంధించి వ్యర్థ భాగాలు, కొవ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తుంటారు.

భారత్‌లో పాలను శాఖాహారంలో భాగంగా తీసుకుంటారు. ఈ క్రమంలో జంతు పదార్థాలను తినే ఆవులు, గేదెల నుంచి వచ్చే ‘నాన్‌ వెజ్‌’ పాలు, పాల పదార్థాలు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని భారత్‌ వాదించింది. ఈ క్రమంలో కేవలం ప్రాసెస్‌ చేసిన పాడి ఉత్పత్తుల దిగుమతులకే అంగీకరించింది. వాటిపైనా ‘జంతు సంబంధిత ఆహారం’ వాడలేదనే ధ్రువీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. అమెరికా నుంచి పాలు, పాల పదార్థాల దిగుమతికి గేట్లు తెరిస్తే.. భారత్‌లోని రైతులకు ఏటా రూ.1.03 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఎస్‌బీఐ తాజా నివేదికలో అంచనా వేసింది.

భారత్‌పై 11.5శాతం..అమెరికాపై 7%

భారత్‌, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరుదేశాల ఉన్నతాధికారులు కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నారు. వాణిజ్యం, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని భారత బృందం పలుమార్లు అమెరికాలోని వాషింగ్టన్‌ వెళ్లి చర్చలు జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర ఒప్పందానికి తుదిరూపం వచ్చినట్టు సమాచారం. దీనిపై ఇరుదేశాల ఉన్నతాధికారులు వారం, పది రోజుల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం...

  • చాలా వరకు భారత ఉత్పత్తులపై 10% కనీస సుంకానికి భారత్‌ అంగీకరించింది. అయితే కొన్ని రకాల ఉత్పత్తులపై గంపగుత్తగా కాకుండా.. కాస్త తక్కువ, ఎక్కువగా వేయాలని ప్రతిపాదించింది. దీనికి అమెరికా అంగీకరించడంతో భారత్‌పై సుంకాలు సగటున 11.5 శాతం అవుతాయని అంచనా. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై భారత సుంకాలు 5-8 శాతం వరకు.. సగటున 7% ఉంటాయని అంచనా.

  • యాపిల్స్‌, బ్లూబెర్రీస్‌, బ్లాక్‌ బెర్రీస్‌, కొన్ని రకాల ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలతోపాటు, పలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్‌ అంగీకరించింది. అయితే జన్యుమార్పిడి ఉత్పత్తులకు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 07:11 AM