ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

COVID-19: 24 గంటల్లో 864 కొవిడ్‌ కేసులు

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:48 AM

దేశంలో గడచిన 24 గంటల్లో 864 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 4,302కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ, జూన్‌ 4: దేశంలో గడచిన 24 గంటల్లో 864 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 4,302కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్‌ సంబంధిత కారణాలతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. మరోవైపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.


తగినంత ఆక్సిజన్‌తో పాటు వెంటిలేటర్లు, పడకలు, తప్పనిసరి ఔషదాలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ప్రజలు శుభ్రతను పాటించాలని, అనారోగ్యంగా అనిపిస్తే ఎక్కువ మంది గుమికూడే చోటకు వెళ్లరాదని కేంద్రం సూచించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మాస్క్‌ తప్పనిసరి చేశారు.

Updated Date - Jun 05 , 2025 | 04:48 AM