DGMO: కాల్పుల విరమణ కొనసాగింపు
ABN, Publish Date - May 16 , 2025 | 05:40 AM
భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించినట్లు భారత మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో) వర్గాలు తెలిపాయి.
ఈ నెల 18న మళ్లీ భారత్, పాక్‌ల డీజీఎంవోల భేటీ!
న్యూఢిల్లీ, మే 15: భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించినట్లు భారత మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో) వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న ఇరు దేశాల డీజీఎంవోల మధ్య హాట్‌లైన్‌లో జరిగిన సమావేశంలో కాల్పుల విరమణకు నిర్ణయించిన విషయం తెలిసిందే..! వీరి మధ్య ఈ నెల 18న మరోమారు సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. తదుపరి నిర్ణయం వెలువడే వరకు.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఉంటుందని భారత వర్గాలు తెలిపాయి.
Updated Date - May 16 , 2025 | 05:40 AM