India Pakistan DGMO talks: ముగిసిన భారత్-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారు
ABN, Publish Date - May 12 , 2025 | 06:19 PM
సీజ్ ఫైర్ ఒప్పందం అనంతరం ఇవాళ జరిగిన భారత్-పాకిస్థాన్ DGMOల చర్చలు ముగిశాయి. హాట్‌లైన్ ద్వారా భారత్-పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ అధికారులు
India Pakistan DGMO talks: ఢిల్లీ: సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన రెండు రోజుల తర్వాత ఇవాళ జరిగిన భారత్-పాకిస్థాన్ DGMOల చర్చలు ముగిశాయి. హాట్‌లైన్ ద్వారా భారత్-పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ అధికారులు చర్చలు జరిపారు. సుమారు గంటపాటు కొనసాగిన DGMOల భేటీలో కాల్పుల విరమణ విధివిధానాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పలు ప్రతిపాదనలను ఇరు దేశాలు ఈ మీటింగ్ లో పెట్టినట్టు సమాచారం.
ఈ చర్చల్లో ఇరు దేశాల DGMOలు పాల్గొన్నారు. భారత్ నుంచి DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్‌ఘాయ్, పాక్ నుంచి DGMO మేజర్ జనరల్ కాశిఫ్ అబ్దుల్లా సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఏప్రిల్ 22వతేదీన 26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థల స్థావరాలపై దాడి చేసింది.
భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత మే 8, 9, 10 తేదీల్లో పాకిస్థాన్.. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌లు, క్షిపణి దాడులకు విఫలయత్నం చేయగా.. పాక్ కుట్రలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో తలెత్తిన ఉద్రిక్తతల మధ్య ఇరుదేశాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఈ క్రమంలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.
Updated Date - May 12 , 2025 | 07:51 PM