ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Pakistan: పాకిస్తాన్‌ను నమ్మడం కష్టం.. కాల్పుల విరమణకు అంగీకారం నిజం కాదా

ABN, Publish Date - May 10 , 2025 | 09:52 PM

పాకిస్తాన్‌ను చాలా దేశాలు రోగ్ కంట్రీగా భావిస్తాయి. ఆ దేశం మాటలను నమ్మడానికి వెనకడుగు వేస్తాయి. అలా ఎందుకు చేస్తాయో తాజా పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొద్ది గంటల్లోనే తన వక్రబుద్ధిని చూపెట్టుకుంది. సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతోంది.

Pak violates ceasefire

పాకిస్తాన్‌ను చాలా దేశాలు రోగ్ కంట్రీగా భావిస్తాయి. ఆ దేశం మాటలను నమ్మడానికి వెనకడుగు వేస్తాయి. అలా ఎందుకు చేస్తాయో తాజా పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొద్ది గంటల్లోనే తన వక్రబుద్ధిని చూపెట్టుకుంది. సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతోంది. బార్డర్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. శ్రీనగర్‌లో పేలుళ్ల శబ్దం వచ్చినట్టు జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా తెలిపారు (India Pakistan cease fire).


పాకిస్తాన్‌లో అటు ప్రభుత్వం, ఇటు సైన్యం సమాన నియంత్రణను కలిగి ఉంటాయి. ఒక్కోసారి పాకిస్తాన్‌లో ప్రభుత్వం కంటే సైన్యానిదే పైచేయి అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని సైన్యం గౌరవిస్తుందని పూర్తిగా నమ్మడానికి లేదు. ఈ విషయం బాగా తెలిసిన భారత సైన్యం సరిహద్దుల్లో సన్నద్ధంగానే ఉంది. కాల్పుల విరమణ అంటూ పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్ దాడిని సమర్థంగానే తిప్పికొడుతోంది. మరి, కాల్పుల విరమణలో పెద్దన్న పాత్ర పోషించిన అమెరికా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.


పాక్ సైన్యం డ్రోన్లతో దాడికి పాల్పడుతుండగా వైమానిక దళాలు అడ్డుకోవడంతో భారీగా పేలుళ్లు శబ్దం వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉదంపూర్‌లో మళ్లీ బ్లాకవుట్ ప్రకటించారు. శ్రీనగర్ అంతట పేలుళ్లు వినిపించాయని, కాల్పుల విరమణ ఒప్పందం ఏమైందని జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు.

Updated Date - May 10 , 2025 | 09:52 PM