ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌కు ఆసియా బ్యాంకు 6,869 కోట్ల సాయం!

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:26 AM

పాకిస్థాన్‌కు అంతర్జాతీయ రుణ సంస్థలు ఏ సాయం చేయొద్దంటూ భారత్‌ పదే పదే కోరుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. గత నెలలోనే ఐఎంఫ్‌ పాక్‌కు రూ.8,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించగా..

  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌

  • నిధులు అభివృద్ధికి కాకుండా సైనిక వ్యయాలకు మళ్లిస్తారని ఆందోళన

  • పాక్‌కు నిధులను అడ్డుకోవడం కేంద్రానికి చేతకావడం లేదు: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జూన్‌ 4: పాకిస్థాన్‌కు అంతర్జాతీయ రుణ సంస్థలు ఏ సాయం చేయొద్దంటూ భారత్‌ పదే పదే కోరుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. గత నెలలోనే ఐఎంఫ్‌ పాక్‌కు రూ.8,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించగా.. తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కూడా 800 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6,869 కోట్ల) రుణం మంజూరు చేసింది. అయితే.. దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. పాక్‌కు అందుతున్న నిధులు దారి మళ్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.


ఈ నేపథ్యంలో బీజేపీ సర్కారుపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. పాక్‌కు నిధులు వెళ్లకుండా అడ్డుకోవడం చేతగావట్లేదంటూ ఆక్షేపించింది. ‘ఈ నెల 1న ఏడీబీ అధ్యక్షుడు మసాటో కందాను మోదీ కలిశారు. ఆ తర్వాత 3రోజులకే ఏడీబీ పాక్‌కు రుణం మంజూరు చేసింది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

Updated Date - Jun 05 , 2025 | 04:26 AM