ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌కు 20 బిలియన్ల ప్యాకేజీపై పునరాలోచన

ABN, Publish Date - May 24 , 2025 | 05:32 AM

పాకిస్థాన్‌ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఎఫ్‌ఏటీఎ్‌ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • ప్రపంచ బ్యాంకుకు విజ్ఞప్తి చేయనున్న భారత్‌

న్యూఢిల్లీ, మే 23: పాకిస్థాన్‌ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఎఫ్‌ఏటీఎ్‌ఫను కలవనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో పాక్‌కు 20 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపే అంశంపై పునరాలోచన చేయాలని ప్రపంచ బ్యాంకుకు భారత్‌ విజ్ఞప్తి చేయనుందని పేర్కొన్నాయి.


అదేవిధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ను తిరిగి గ్రే లిస్ట్‌లోకి చేర్చాలని ఎఫ్‌ఏటీఎ్‌ఫపై ఒత్తిడి తీసుకొచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. దీనిద్వారా దాయాది దేశం ఆర్థిక లావాదేవీలపై పర్యవేక్షణ పెరుగుతుంది. అలాగే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులతో పాటు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి నిధుల విడుదలకు అడ్డుకట్ట వేయాలని భారత్‌ యోచిస్తోంది.

Updated Date - May 24 , 2025 | 05:32 AM