Diplomatic Expulsion: గూఢచర్యం ఆరోపణలతో పాక్ హైకమిషన్ అధికారిపై బహిష్కరణ
ABN, Publish Date - May 14 , 2025 | 06:05 AM
ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ పాకిస్థాన్ అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. పంజాబ్ పోలీసుల విచారణకు సంబంధించి గూఢచర్యం ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశం
న్యూఢిల్లీ, మే 13 : ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయంలో పనిచేస్తోన్న ఆ దేశ అధికారి ఒకరిని భారత్ మంగళవారం బహిష్కరించింది. ఆయన తన హోదాకు తగని విధంగా వ్యవహరిస్తుండడంతో 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పంజాబ్ పోలీసులు విచారిస్తోన్న ఓ గూఢచర్యం కేసుకు సంబంధించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పంజాబ్ పోలీసులు ఆదివారం గూఢచర్యం ఆరోపణలపై ఒక మహిళ, మరో పురుషుడిని అరెస్టు చేశారు. వీరికి పాక్ హై కమిషన్ కార్యాలయంలోని ఆ అధికారితో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. భారత సైన్యం కదలికలపై వీరు పాక్‌కు సమాచారం చేరవేస్తున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
Updated Date - May 14 , 2025 | 06:05 AM