ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై దాడి ఫేక్‌

ABN, Publish Date - May 11 , 2025 | 04:19 AM

పాకిస్థాన్‌లోని నన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై భారత్‌ డ్రోన్‌ దాడి చేసిందన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం కొట్టిపారేసింది. భారత్‌లో మత విద్వేషాలు సృష్టించేందుకు అలాంటి ప్రచారం జరుగుతోందని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ వెల్లడించింది.

  • పలు తప్పుడు సమాచారాలను కొట్టిపారేసిన కేంద్రం

న్యూఢిల్లీ, మే 10: పాకిస్థాన్‌లోని నన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై భారత్‌ డ్రోన్‌ దాడి చేసిందన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం కొట్టిపారేసింది. భారత్‌లో మత విద్వేషాలు సృష్టించేందుకు అలాంటి ప్రచారం జరుగుతోందని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ వెల్లడించింది. ‘నన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై భారత్‌ డ్రోన్‌ దాడి చేసినట్లు పేర్కొంటూ సోషల్‌ మీడియాలో ఒక వీడియో షేర్‌ అవుతోంది. అది పూర్తిగా నకిలీ’ అని స్పష్టం చేసింది. నన్‌కానా సాహిబ్‌ అనేది సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్‌ జన్మస్థలం.


అదేవిధంగా జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌ ఎయిర్‌బే్‌సను పాకిస్థాన్‌ ధ్వంసం చేసిందని సోషల్‌ మీడియాతో పాటు పలు వార్తావేదికలపై జరుగుతున్న ప్రచారాన్ని కూడా ప్రభుత్వం ఖండించింది. ఆ సైనిక స్థావరం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని వెల్లడించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థానీ మీడియా, సోషల్‌ మీడియా వేదికల్లో ఈ విధమైన దుష్ప్రచారం జరుగుతోందని తెలిపింది. ఇంకా పాకిస్థాన్‌లో ఒక వైమానిక మహిళా పైలట్‌ పట్టుబడ్డారని, భారత పవర్‌గ్రిడ్‌ కుప్పకూలిందని, ముంబై-ఢిల్లీ ఎయిర్‌లైన్‌ మార్గాన్ని తాత్కాలికంగా మేసివేశారన్న ప్రచారాలను కూడా నకిలీగా కేంద్రం కొట్టిపారేసింది.

Updated Date - May 11 , 2025 | 04:19 AM