OTT App Ban India: 25 అశ్లీల ఓటీటీ యాప్‌లపై నిషేధం
ABN, Publish Date - Jul 26 , 2025 | 03:40 AM
ఓటీటీల్లో విచ్చలవిడిగా ప్రసారమవుతున్న అసభ్యకర, అశ్లీల కంటెంట్‌కు చెక్ పెట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..
జాబితాలో ఉల్లూ, దేశీఫ్లిక్స్, ఏఎల్‌టీటీ...
న్యూఢిల్లీ, జూలై 25: ఓటీటీల్లో విచ్చలవిడిగా ప్రసారమవుతున్న అసభ్యకర, అశ్లీల కంటెంట్‌కు చెక్ పెట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఓటీటీలు ఉల్లూ, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్ సహా 25 యాప్‌లపై నిషేధం విధించింది. వీటి ప్రసారాలు తక్షణం నిలిపివేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎ్‌సపీ)ను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అశ్లీల కంటెంట్ ప్రసారాలను అడ్డుకొనేందుకే ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసింది. నిషేధించిన యాప్‌ల జాబితాలో.... ఏఎల్‌టీబాలాజీ (ఏఎల్‌టీటీ), ఉల్లూ, బిగ్ షాట్స్ యాప్, దేశీఫ్లిక్స్, బూమెక్స్, నియాన్‌ఎక్స్ వీఐపీ, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, షోహిట్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్, ఫ్యూగీ, ఫీనియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, ట్రైఫ్లిక్స్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 03:40 AM