ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

INDIA Alliance: ఉపరాష్ట్రపతి బరిలో ఇండియా అభ్యర్థి

ABN, Publish Date - Aug 11 , 2025 | 02:46 AM

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకపక్షం కాకుండా చేసేందుకు, విపక్షాల ఐక్యతను చాటి చెప్పేందుకు కాంగ్రెస్‌

  • మిత్రపక్షాలతో ఖర్గే చర్చలు

  • ఎన్డీయే నేత నిర్ణయం తర్వాతే విపక్ష కూటమి అభ్యర్థి ఖరారు

న్యూఢిల్లీ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి ఎన్నిక ఏకపక్షం కాకుండా చేసేందుకు, విపక్షాల ఐక్యతను చాటి చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇండియా కూటమి తరఫున అభ్యర్థిని నిలపాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే కూటమి నేతలతో చర్చించినట్టు తెలిసింది. ఉప రాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామా, ఎన్డీయే కూటమి వ్యవహరిస్తున్న తీరుపై ఇండియా కూటమి ఎంపీలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకపక్షంగా వదిలేయకుండా తాము కూడా గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, తొలుత ఎన్డీయే అభ్యర్థి ఎవరనేది తేలిన తర్వాత ఆ అభ్యర్థికి దీటుగా ఇండియా కూటమి అంతే బలమైన అభ్యర్థిని బరిలో నిలవాలని ఎంపీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో, ఎవరిని బరిలో నిలపాలనే అంశంపై మాత్రం ఎలాంటి చర్చలు జరగలేదని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అభ్యర్థి ఎంపికపై ఎవరూ తొందరపడి ప్రకటనలు చేయవద్దని ఇండియా కూటమి నేతలకు ఖర్గే సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఢిల్లీలో ఓ హోటల్‌లో ఇండియా కూటమి ముఖ్యులు, ఎంపీలకు ఖర్గే విందు ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఆ సమావేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమిని బరిలో నిలిపే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. తద్వారా విపక్షాలు ఐక్యంగా ఉన్నాయన్న సంకేతాన్ని పంపించాలన్నది కీలక నిర్ణయంగా కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంది.

ఎన్డీయే విజయం ఖాయం

బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి తరఫున బరిలో నిలిచే ఉప రాష్ట్రపతి అభ్యర్థి విజయం లాంఛనమేనని తెలుస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తుత సభ్యుల సంఖ్య 781. వీరిలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ రావడానికి 391 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 మంది సభ్యుల బలం ఉండగా, రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇండియా కూటమికి లోక్‌సభలో 234 మంది సభ్యులు, రాజ్యసభలో 79 మంది సభ్యుల బలముంది. అంటే.. ఉభయ సభల్లో కలిపి ఎన్డీయేకు 422 మంది, విపక్షానికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్డీయే అభ్యర్థి విజయం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

నేడు నిరసన

‘ఓట్ల చోరీ’ అంశాన్ని నిరసిస్తూ.. విపక్ష ఇండియా బ్లాక్‌ ఎంపీలు.. సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు జరిగే ఈ ప్రదర్శనలో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ సహా ఆయా పార్టీల పార్లమెంటరీ పక్ష నాయకులు, ఇండియా బ్లాక్‌ పార్టీల ముఖ్యనేతలు, ఎంపీలు పాదయాత్రగా బయలు దేరి ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకుంటారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Aug 11 , 2025 | 02:46 AM