ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IMD: ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 వరకు వర్షాలు

ABN, Publish Date - Jan 28 , 2025 | 01:42 PM

అసలే చలి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో వర్షాలు కూడా ఉన్నాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అయితే ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎప్పటివరకు ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

IMD Rain alert

ఓ వైపు చలి పెరుగుతున్న వేళ, వర్షాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అనేక రాష్ట్రాలను ప్రభావితం చేస్తుందని వాతావరణ శాఖ (imd) వెల్లడించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ హిమాలయ ప్రాంతంతోపాటు మరికొన్ని చోట్ల వర్షాలు (rains) సంభవించనున్నాయని వెల్లడించింది. దీంతో జనవరి 29 నుంచి పలు ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు, హిమపాతం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అధికారులు తెలిపారు. ఈ క్రంమలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మైదానాలలో వర్షాలు/హిమపాతం సంభవించే అవకాశం ఉందని ప్రకటించింది.


ఈ ప్రాంతాల్లో ప్రయాణానికి అంతరాయం..

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో చలి పెరిగి ప్రయాణం కష్టంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు వ్యాపించే అవకాశం ఉన్నందున, జనవరి 30 వరకు కొన్ని ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గిపోవచ్చని తెలిపింది. అలాగే పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో జనవరి 29 వరకు రాత్రి, ఉదయం వేళల్లో పొగమంచు కారణంగా ప్రయాణంలో అంతరాయం ఏర్పడే ఛాన్సుంది. ఫిబ్రవరి 2న ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లో కూడా పొగమంచు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ ప్రాంతాలలో కూడా జనవరి 31 వరకు విస్తృతంగా పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.


దక్షిణ భారతదేశంలో కూడా..

దీంతోపాటు దక్షిణ భారతదేశంలో మరో తుఫాను వచ్చే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. అలాగే జనవరి 31న కేరళ, మాహేలో కూడా వర్షపు పరిస్థితులు ఉంటాయన్నారు. జనవరి 28న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు కొనసాగే అవకాశం ఉంది. జనవరి చివరి నుంచి చలిగాలులు మరింత తీవ్రతతో కొనసాగే ఛాన్సుంది. ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. జనవరి 30 వరకు ఈ ప్రాంతాలలో చలిగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఢిల్లీ వెదర్ ఎలా ఉందంటే..

జనవరి 28న మంగళవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక ప్రకారం ‘పేలవంగా’ 259గా నమోదైంది. ఇదే పరిస్థితి రెండో రోజు కూడా కొనసాగింది. గాలి నాణ్యత సూచిక పెరగడం వల్ల నగరంలో నివసించే ప్రజలు హానికరమైన కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నారని చెప్పవచ్చు. ఢిల్లీ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. ఐఎండీ సమాచారం ప్రకారం జనవరి 30న నగరం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, వర్షాలు లేకపోయినా వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.


ఇవి కూడా చదవండి:

PM KISAN: రైతులకు శుభవార్త.. మళ్లీ ఖాతాల్లోకి డబ్బులు


Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..


Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 28 , 2025 | 01:44 PM