ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Husband And Wife: ఇద్దరిదీ ప్రేమ వివాహం.. భార్యను అత్యంత దారుణంగా..

ABN, Publish Date - May 28 , 2025 | 07:17 PM

Husband And Wife: 4 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండున్నర సంవత్సరాల ఓ కూతురు కూడా ఉంది. గత వారం ఇద్దరూ కలిసి బంధువుల పెళ్లికి కూడా వెళ్లి వచ్చారు. కారణం ఏంటో తెలీదు కానీ, కొద్దిరోజుల క్రితం ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది.

Husband And Wife

భార్యాభర్తల బంధం అన్న తర్వాత గొడవలు సహజం. గొడవలు లేకపోతేనే ఆ బంధం సాఫీగా సాగదు. ఎప్పుడో ఓ రోజు టైటానిక్ షిప్‌లా కుప్పకూలిపోతుంది. అయితే, గొడవలు భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేసేలా ఉండాలి కానీ.. తుంచేలా ఉండకూడదు. కొన్ని సార్లు గొడవల సమయంలో క్షణికావేశం కారణంగా దారుణాలు జరుగుతూ ఉంటాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం.. చంపుకోవటం వంటివి కూడా జరుగుతుంటాయి. తాజాగా, ఓ భర్త గొడవ సందర్బంగా భార్యను కత్తితో పొడిచి చంపేశాడు.


పది సార్లు అత్యంత పాశవికంగా పొడిచి మరీ ఆమె ప్రాణాలు తీశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిక్కమంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిక్కమంగళూరు తాలూకా, కైమారాకు చెందిన కీర్తి, అవినాష్ భార్యాభర్తలు. 4 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండున్నర సంవత్సరాల ఓ కూతురు కూడా ఉంది. గత వారం ఇద్దరూ కలిసి బంధువుల పెళ్లికి కూడా వెళ్లి వచ్చారు. కారణం ఏంటో తెలీదు కానీ, కొద్దిరోజుల క్రితం ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది.


ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. అవినాష్ భార్య మీద కోపంతో ఊగిపోయాడు. కత్తితో ఆమెపై దాడి చేశాడు. దాదాపు 10 సార్లు ఆమెను పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కీర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అవినాష్ కోసం గాలిస్తున్నారు. మర్డర్ జరగటానికి గల సరైన కారణం ఏంటో తెలీదని పోలీసులు అన్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆపరేషన్ సిందూర్.. ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్

పెళ్లికొచ్చిన అనుకోని అతిథి.. షాక్ అయిన జనం..

Updated Date - May 28 , 2025 | 07:35 PM