ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..

ABN, Publish Date - May 24 , 2025 | 04:33 PM

Husband And Wife: దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ఆ వ్యక్తికి భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. అక్కడినుంచి నేరుగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి.. టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ బయటకు తెచ్చాడు.

Husband And Wife

మద్యం మత్తులో ఓ భర్త ఘాతుకానికి ఒడిగట్టాడు. సెల్‌ఫోన్ సౌండ్ తగ్గించమన్నందుకు భార్యతో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. నొప్పితో గిలగిల్లాడుతున్న భార్యను పట్టించుకోకుండా పారిపోయాడు. తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రి పాలైంది. ఈ దారుణ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులోని సీదెదహళ్లికి చెందిన ఓ వ్యక్తి తాగుడుకు బానిస అయ్యాడు. భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తున్నాడు. మద్యం కోసం భార్యను నిత్యం హింసిస్తూ ఉన్నాడు.


బ్యూటీ పార్లర్‌లో పని చేసే ఆమె భర్త కారణంగా చాలా కష్టాలు పడుతోంది. మే 19వ తేదీన రాత్రి 9 గంటల నేపథ్యంలో మద్యం కోసం డబ్బులు కావాలని ఆ వ్యక్తి భార్యను అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వనని చెప్పింది. దీంతో ఆమెను హింసించి మరీ డబ్బులు రాబట్టాడు. బయటకెళ్లి మందు తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే తన ఫోన్‌లో సౌండ్ ఎక్కువ పెట్టి పాటలు వినడం మొదలెట్టాడు. ఆమె సౌండ్‌ను భరించలేకపోయింది. సౌండ్ తగ్గించమని భర్తను అడిగింది. ఇందుకు అతడు ఒప్పుకోలేదు.


దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ఆ వ్యక్తికి భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. అక్కడినుంచి నేరుగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి.. టాయిలెట్ క్లీన్ చేసే యాసిడ్ బయటకు తెచ్చాడు. దాన్ని భార్య ముఖంపై పోశాడు. యాసిడ్ ముఖంపై పడగానే ఆమె విలవిల్లాడిపోయింది. నొప్పి భరించలేక గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. భర్త భయంతో అక్కడినుంచి పరుగులు తీశాడు. ఆమె అరుపులు విన్న పొరిగింటి వాళ్లు అక్కడికి వచ్చారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భర్త కోసం అన్వేషిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Bitter Gourd: షుగర్ కంట్రోల్ కావాలంటే కాకరకాయ ఇలా తినండి..

Updated Date - May 24 , 2025 | 05:09 PM