Humayun Tomb: కూలిన హుమాయూన్ సమాధి గోపురం, ఆరుగురు మృతి
ABN, Publish Date - Aug 15 , 2025 | 05:49 PM
మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ మరణాంతరం అతని భార్య హుమీదా భాను బేగం ఆదేశానుసారం 1562లో సమాధి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎనిమిదేళ్ల పాటు నిర్మాణం జరిగింది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో విషాద ఘటన చోటుచేసుకుంది. హజ్రత్ నిజాముద్దీన్ ఏరియాలోని చారిత్రక హుమాయూన్ సమాధి గోపురంలో కొంతభాగం శుక్రవారం నాడు మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. 11 మందిని శిథిలాల నుంచి సహాయక సిబ్బంది కాపాడి సమీప ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌టీమ్‌లు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్ట్రక్చరల్ ఇంజనీర్లు, ఇన్వెస్టిగేటర్లు ప్రమాద స్థలిని పరిశీలించేందుకు వీలుగా దర్గా చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సమాధి గోపురం కూలిపోవడానికి కారణాలపై విచారణ చేపట్టారు.
మొఘల్ చక్రవర్తి హుమాయూన్ మరణాంతరం అతని భార్య హుమీదా భాను బేగం ఆదేశానుసారం 1562లో ఈ సమాధి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎనిమిదేళ్ల పాటు నిర్మాణం జరిగింది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన్ చక్ర.. ఎర్రకోట వేదికగా మోదీ
ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 15 , 2025 | 09:19 PM