Amit Shah: సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, సీఎస్ లతో అమిత్ షా సమావేశం
ABN, Publish Date - May 07 , 2025 | 03:04 PM
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కొద్దిసేపటిక్రితం సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో ..
Home Minister Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కొద్దిసేపటిక్రితం సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఇలా ఉండగా, భారత ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. భవిష్యత్ లో తీసుకోబోతున్న చర్యలు, యుద్ధానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రధాని, రాష్ట్రపతికి వివరించినట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా, రేపు మరోమారు అఖిలపక్షం భేటీ కాబోతోంది. యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ గురించి, భవిష్యత్ లో తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వం విపక్షాలకు వివరించనుంది.
ఆపరేషన్ సిందూర్ పై రేపు జరిగే అఖిలపక్ష సమావేశం చాలా కీలకం కానుంది. ఉదయం 11గం.లకు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది కేంద్రం. ఈ భేటీలో ప్రధాని మోదీ కూడా పాల్గొనే అవకాశం కన్పిస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరాలు వెల్లడించారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఆపరేషన్ సిందూర్ వివరాలు.. భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత తదితర విషయాలను అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించనుంది.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్.. పాకిస్థాన్ పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు వాయిదా వేసుకున్నారు. క్రొయేషియా, నెదర్లాండ్స్, నార్వే దేశాల పర్యటనను వాయిదా వేసుకున్నారని ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. ఇండియా, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
Updated Date - May 07 , 2025 | 03:04 PM