ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ తొలి భేటీ

ABN, Publish Date - Jun 17 , 2025 | 06:20 AM

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి సమావేశమైంది. విమాన ప్రమాదానికి దారి తీసిన కారణాలపై చర్చించింది.

  • సీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్న ఏఏఐబీ అధికారులు

న్యూఢిల్లీ, జూన్‌ 16: అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి సమావేశమైంది. విమాన ప్రమాదానికి దారి తీసిన కారణాలపై చర్చించింది. సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. విమాన ప్రమాదానికి గల కారణాలపై అందరి అభిప్రాయాలు తీసుకొని.. భేటీలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మరోవైపు.. విమాన ప్రమాదంపై ప్రత్యేక దర్యాప్తు జరుపుతున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ) ప్రమాదం స్థలంలో కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)ను గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఇటు అమెరికాకు చెందిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎ్‌సబీ) కూడా రంగంలోకి దిగింది. విమాన ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు అనేక మంది అంతర్జాతీయ నిపుణులను ప్రమాద స్థలానికి రప్పించింది.

Updated Date - Jun 17 , 2025 | 06:20 AM