ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: స్పోర్ట్స్, స్పేస్ స్టార్టప్‌లు పెట్టేందుకు ముందుకు రండి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ABN, Publish Date - Jul 27 , 2025 | 04:34 PM

దేశంలో స్పోర్ట్స్, స్పేస్ రంగంలో స్టార్టప్‌లు పెట్టేందుకు యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రంగాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువత ఆ దిశగా ఆలోచనలు చేయాలని కోరారు.

PM Modi in Mann ki Baat

ఢిల్లీ, జులై 27: దేశంలో స్పోర్ట్స్ స్టార్టప్‌లు పెట్టేందుకు యువ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, యువత ఆ దిశగా ఆలోచనలు చేయాలని కోరారు. 124వ మన్‌కీ బాత్‌ కార్యక్రమం ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోదీ.. క్రీడా రంగంలోని స్టార్టప్‌లకు పూర్తి మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని విజ్ఞానం, క్రీడలు, సంస్కృతిక రంగలలో భారత్‌ సాధించిన విజయాలపై మాట్లాడారు.

ఇటీవలి కాలంలో భారత్‌లో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయన్న ప్రధాని.. అవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. శుభాన్షు శుక్లా ఐఎస్‌ఎస్‌(ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)కు వెళ్లి వచ్చాక దేశమంతా ఆనందంతో పొంగిపోయిందన్నారు. అలాగే, చంద్రయాన్‌-3ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేసిన తర్వాత దేశంలో ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులు, చిన్నారులు సైతం అంతరిక్ష రంగం మీద ఆసక్తి చూపుతున్నారన్నారని తెలిపారు.

భారత విద్యార్థులు స్సేస్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని, ప్రతి విద్యార్థి ఓ కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారని తెలిపారు. భారత్‌లో ఐదేళ్ల క్రితం 50 కంటే తక్కువ స్పేస్ స్టార్టప్స్ మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం స్పేస్ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయని వివరించారు. 'ఇన్‌స్పైర్‌ మనక్‌ అభియాన్‌' గురించి మాట్లాడుతూ మోదీ.. ఈ పథకం విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమమని.. ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని దీనికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్‌ స్పేస్‌ డే సందర్భంగా దేశప్రజలు తమ సూచనలు, సలహాలు పంపాలని పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి..

ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..

ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 27 , 2025 | 05:58 PM