ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

G7 Summit: ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది

ABN, Publish Date - Jun 17 , 2025 | 06:02 AM

ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని కెనడాలో జరుగుతోన్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉండరాదని కూడా ఓ ముసాయిదా ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది.

  • జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు

కనానాస్కిస్‌, జూన్‌ 16: ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందని కెనడాలో జరుగుతోన్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు స్పష్టం చేసింది. అదే సమయంలో ఇరాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉండరాదని కూడా ఓ ముసాయిదా ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది. ప్రాంతీయ సుస్ధిరత కోసం రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ముసాయిదాలో సూచించాయి. మరోవైపు సదస్సులో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యుద్ధంలో ఇరాన్‌ గెలవదన్నారు. ఆలస్యం కాకముందే ఇరాన్‌ సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభిస్తే మేలని సూచించారు. అమెరికా సంస్థలపై దాడి చేస్తే కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిదాడులు చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు ముసాయిదా ప్రకటనపై సంతకం చేసేందుకు ట్రంప్‌ నిరాకరించారని సమాచారం.ఔ కాగా, ప్రధాని మోదీ సైప్రస్‌ పర్యటన ముగించుకుని జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా చేరుకున్నారు.

ఆగస్టులో ట్రంప్‌ మొబైల్‌ ఫోన్లు

వాషింగ్టన్‌ డీసీ, జూన్‌ 16: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. ఆయన సొంత సంస్థ(ట్రంప్‌ ఆర్గనైజేషన్‌) ట్రంప్‌ మొబైల్‌ పేరిట స్మార్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. టీ1 పేరిట గోల్డెన్‌ కలర్‌ ఫోన్‌ను ఆగ్‌స్టలో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. దీని ఖరీదు 499 డాలర్లు. అమెరికాలో ఏటా ఆరు కోట్ల మొబైల్‌ ఫోన్లు అమ్ముడుపోతున్నా ఉత్పత్తి మాత్రం బయట దేశాల్లోనే జరుగుతోంది. అయితే ట్రంప్‌ ఫోన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమెరికాలోనే తయారవుతాయి. ట్రంప్‌ ఫోన్‌ నెలవారీ ప్లాన్లలో 47 డాలర్లకే హై స్పీడ్‌తో 20జీబీ డాటా, అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌, సందేశాలు పంపే అవకాశమిచ్చారు.

Updated Date - Jun 17 , 2025 | 06:02 AM