Black Magic : క్షుద్రపూజల నెపంతో బిహార్‌లో ఐదుగురి హత్య
ABN, Publish Date - Jul 08 , 2025 | 05:54 AM
క్షుద్రపూజలు చేస్తున్నారనే నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్థులు హత్య చేశారు. అనంతరం మృతదేహాలకు నిప్పంటించారు.
బిహార్, జూలై 7: క్షుద్రపూజలు చేస్తున్నారనే నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్థులు హత్య చేశారు. అనంతరం మృతదేహాలకు నిప్పంటించారు. ఈ ఘటన పూర్ణియా జిల్లాలోని టెట్‌గామా గ్రామం లో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుమారులలో ఒకరు ఇటీవల చనిపోగా, మరొకరు అనారోగ్యానికి గురయ్యారు.
వీరికి గ్రామానికి చెందిన సీతాదేవి అనే మహిళ క్షుద్రపూజలు చేసిందనే అనుమానంతో 50 మంది గ్రామస్థులు అర్థరాత్రి ఆమె ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో సదరు మహిళ సహా ఆమె కుటుంబసభ్యులు ఐదుగురు మృతిచెందారు. అనంతరం గ్రామస్థులు ఆ మృతదేహాలకు నిప్పంటించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు.
Updated Date - Jul 08 , 2025 | 05:54 AM