ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: ముగియనున్న నిషేధకాలం.. వేటకు గంగపుత్రులు సన్నద్ధం

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:06 PM

రాష్ట్రంలో చేపల వేటకు ప్రభుత్వం విధించిన నిషేధం గడువు 14వ తేదీ అర్ధరాత్రితో ముగియనుంది. దాదాపు రెండు నెలలుగా ఉపాధి కోల్పోయిన గంగపుత్రులు నిషేధకాలం గడువు ముగిసే రోజు దగ్గరపడుతుండటంతో మళ్ళీ చేపలవేటకు సన్నద్ధమవుతున్నారు.

- 14వ తేదీ అర్ధరాత్రితో గడువు సమాప్తం

- చేపల ధరలు తగ్గే అవకాశం

చెన్నై: రాష్ట్రంలో చేపల వేటకు ప్రభుత్వం విధించిన నిషేధం గడువు 14వ తేదీ అర్ధరాత్రితో ముగియనుంది. దాదాపు రెండు నెలలుగా ఉపాధి కోల్పోయిన గంగపుత్రులు నిషేధకాలం గడువు ముగిసే రోజు దగ్గరపడుతుండటంతో మళ్ళీ చేపలవేటకు సన్నద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో చెన్నై(Chennai) నుంచి కన్నియాకుమారి వరకువున్న కోస్తా జిల్లాల్లోని కడలిపుత్రులు వేటకు వినియోగించే సామగ్రిని సిద్ధంచేసుకుంటున్నారు.

చేపల సంతానోత్పత్తి దృష్ట్యా ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 14వ తేదీ వరకు ప్రభుత్వం సముద్రంలో చేపలవేట నిషేధించింది. దీంతో సుమారు 5,262 ఫిషింగ్‌ కాలర్స్‌ 60 రోజులపాటు తీరం నుంచి కదల్లేదు. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రితో నిషేధకాలం ముగియనుంది. నిషేధకాలంలో రాష్ట్రవ్యాప్తంగా చేపలు, రొయ్యలు, పీతల తదితరాల ధరలు కూడా రెండింతలు పెరిగాయి.

నిషేధ సమయంలో కొంతమంది జాలర్లు నాటుపడవల్లో సముద్రంలో పరిమిత దూరం వరకు మాత్రమే వెళ్ళేందుకు అనుమతించడంతో అతి తక్కువ సంఖ్యలోనే చేపలు లభించడంతో ధరలు ఆకాశానంటాయి. ఈ నేపథ్యంలో, వచ్చే ఆదివారం ఉదయం నుంచి చేపల ధరలు తగ్గే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 11 , 2025 | 12:06 PM