ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Father Takes Revenge: కూతురి హత్య.. ఏడాది తర్వాత ప్రతీకారం తీర్చుకున్న తండ్రి..

ABN, Publish Date - May 08 , 2025 | 07:21 AM

Father Takes Revenge: నితీష్ తనకు అన్నలాంటి వాడని దీపిక చెప్పింది. కుటుంబసభ్యులు హెచ్చరించడంతో నితీష్‌కు దూరంగా ఉంటోంది. ప్రియురాలు దూరం అవ్వటంతో నితీష్ తట్టుకోలేకపోయాడు.

Father Takes Revenge

ఓ తండ్రి కూతురి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడు. పక్కా ప్లాన్‌తో కూతుర్ని చంపిన వ్యక్తి తండ్రిని హత్య చేశాడు. కూతురు చనిపోయిన సంవత్సరం తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాండ్య జిల్లా మాణిక్యణ హళ్లికి చెందిన దీపిక టీచర్‌గా పని చేస్తోంది. ఆమెకు కొన్నేళ్ళ క్రితం పెళ్లయింది. అయితే, దీపికకు అదే గ్రామానికి చెందిన నితీష్ అనే వ్యక్తితో పరిచయం అయింది.


ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరచుగా ఇద్దరూ కలుస్తూ ఉండేవారు. ఈ విషయం కాస్తా దీపిక భర్తకు, కుటుంబసభ్యులకు తెలిసింది. దీపిక భర్త నితీష్‌ను హెచ్చరించాడు. వారి సంబంధం గురించి దీపికను నిలదీశాడు. నితీష్ తనకు అన్నలాంటి వాడని దీపిక చెప్పింది. కుటుంబసభ్యులు హెచ్చరించడంతో నితీష్‌కు దూరంగా ఉంటోంది. ప్రియురాలు దూరం అవ్వటంతో నితీష్ తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే 2024, జనవరి 19వ తేదీన పుట్టినరోజని చెప్పి దీపికను కొండపైకి తీసుకెళ్లాడు.


ఆమె అతడి కోసం ఓ షర్టును గిఫ్ట్‌గా తీసుకెళ్లింది. కొండపైకి వెళ్లిన తర్వాత ఇద్దరికీ గొడవ జరిగింది. ఆ గొడవ సందర్బంగా నితీష్, దీపికపై దాడి చేసి చంపేశాడు. కొన్ని రోజుల తర్వాత దీపిక మర్డర్ అయిన సంగతి బయటపడింది. ఈ కేసుకు సంబంధించి నితీష్ జైలు పాలయ్యాడు. కొన్ని నెలలు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. కూతురి మరణంతో దీపిక తండ్రి వెంకటేష్ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. తన కూతుర్ని చంపిన వారిపై పగతీర్చుకోవాలని అనుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండు రోజుల క్రితం నితీష్ చెల్లెలికి పెళ్లి నిశ్చయం అయింది.


ధర్మస్థలంలో ఆదివారం పెళ్లి జరుగుతూ ఉంది. పెళ్లికి వెళ్లడానికి నితీష్ తండ్రి నరసింహ గౌడే ఇంటినుంచి ధర్మస్థలం బయలు దేరాడు. వెంకటేష్ అతడ్ని ఫాలో అయ్యాడు. ఊరి బయటకు రాగానే కత్తితో నరసింహపై దాడి చేశాడు. ‘ నా కూతుర్ని చంపించి.. నీ కూతురికి పెళ్లి చేస్తున్నావా..’ అంటూ కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు

Hyderabad: ఎయిర్‌గన్‌తో హల్‌చల్‌ చేసి.. ప్రియురాలితో ఎంజాయి చేసేందుకు వచ్చి..

Updated Date - May 08 , 2025 | 07:21 AM