ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

FASTag New Rules: వాహన దారులకు అలర్ట్.. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ కొత్త విధానం అమలు..

ABN, Publish Date - Aug 12 , 2025 | 02:07 PM

జాతీయ రహదారులపై మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, ఖర్చు తక్కువగా ఉండేలా భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతోంది. అదే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్. ఈ స్కీం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది.

fastag update august 15

దేశంలో జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తున్నవారికి కీలక అలర్ట్ వచ్చేసింది. ఇకపై ప్రతి టోల్ వద్ద వాహనం వాహనం ఆపి టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే NHAI (National Highways Authority of India) ఆగస్టు 15 నుంచి FASTag Annual Pass అనే కొత్త స్కీంను ప్రారంభించబోతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పాస్ ద్వారా హైవే టోల్ బూత్‌ల వద్ద ఎదురయ్యే ఆలస్యం, రద్దీ వంటి సమస్యలను నివారించుకుని ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చు.

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అంటే ఏంటి?

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారి కోసం రూపొందించిన ఒక సరికొత్త పథకం. ఈ పాస్‌తో కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి ప్రైవేట్ వాహనాలు ఒకేసారి రూ. 3,000 చెల్లించడం ద్వారా ఒక సంవత్సరంలో 200 టోల్ క్రాసింగ్‌ల వరకు ప్రయాణించవచ్చు. ఏది ముందు వస్తే అది. ఈ పాస్ ద్వారా టోల్ బూత్‌ల వద్ద తరచూ ఫాస్టాగ్ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు.

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఎలా పనిచేస్తుంది?

ఈ యాన్యువల్ పాస్ NHAI నిర్వహించే జాతీయ రహదారులు (NH), జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై (NE) మాత్రమే చెల్లుతుంది. ఉదాహరణకు, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-నాసిక్, ముంబై-సూరత్, ముంబై-రత్నగిరి వంటి రహదారులపై ఈ పాస్ ఉపయోగపడుతుంది. అయితే, రాష్ట్ర రహదారులు లేదా మున్సిపల్ టోల్ రోడ్లపై (ఉదాహరణకు, ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే, అటల్ సేతు, ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వే, అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే) ఈ పాస్ చెల్లదు. సాధారణ ఫాస్టాగ్ ఛార్జీలు వర్తిస్తాయి.

కాలం ముగిసిన తర్వాత

క్లోజ్డ్ టోలింగ్ రహదారులలో (ఉదాహరణకు, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే), ఒక ట్రిప్ అంటే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు కలిపి ఒక్కటిగా పరిగణించబడుతుంది. ఓపెన్ టోలింగ్ రహదారులలో (ఉదాహరణకు, ఢిల్లీ-చండీగఢ్), ప్రతి టోల్ ప్లాజా క్రాసింగ్ ఒక ట్రిప్‌గా లెక్కించబడుతుంది. పాస్ చెల్లుబాటు కాలం ముగిసిన తర్వాత, రూ. 3,000 చెల్లించి దాన్ని రీన్యూ చేసుకోవచ్చు. అలాగే, ఒక సంవత్సరంలో 200 ట్రిప్‌ల పరిమితి ముగిస్తే, సాధారణ ఫాస్టాగ్ రీఛార్జ్ లాగానే ఈ పాస్‌ను మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఎలా పొందాలి?

  • రాజ్‌మార్గ్ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

  • మీ వాహన రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయండి.

  • ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్ చెల్లుబాటులో ఉందని, బ్లాక్‌లిస్ట్‌లో లేదని నిర్ధారించుకోండి.

  • రూ. 3,000 ఫ్లాట్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

  • చెల్లింపు నిర్ధారణ అయిన తర్వాత, మీ యాన్యువల్ పాస్ మీ ఫాస్టాగ్‌కు లింక్ అవుతుంది.

  • ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు కొత్తది కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని రోడ్డు రవాణా, రహదారుల శాఖ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2025 | 02:08 PM