Errol Musk: ఇండియాలో పర్యటించాలని ఎలాన్ మస్క్‌కు సూచించిన తండ్రి
ABN, Publish Date - Jun 02 , 2025 | 10:15 PM
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్.. భారత్‌లో పర్యటించాలంటూ తన తనయుడికి సూచించారు. ఇప్పటివరకూ అతడు ఇండియాకు రాకపోవడమంటే ఒకరకంగా పెద్ద తప్పు చేస్తున్నట్టే అని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఎలాన్ మస్క్ ఇండియాలో పర్యటించాలని అన్నారు. కాస్త రెస్టు తీసుకుని ఇండియాకు రావాలని తనయుడికి చెప్పారు.
తన కొడుకు ఎలాన్ మస్క్ ఉత్సాహవంతుడని ఎరోల్ మస్క్ అన్నారు. అతడికి ఏ సలహా ఇస్తారని రిపోర్టర్ ప్రశ్నించగా ముందు కాస్త రెస్టు తీసుకోవాలని చెబుతానని ఎరోల్ మస్క్ బదులిచ్చారు. ‘ముందు రెస్టు తీసుకో, ఆ తరువాత ఇండియాలో పర్యటించు. మస్క్‌ను కలిస్తే నేను చెప్పేది ఇదే. మస్క్ వయసు ఇప్పుడు 53. ఈ సంఖ్య వింటే చాలా వృద్ధుడు అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఎలాన్ మస్క్ 30ల్లో ఉన్నవాడిలా ఉంటాడు’
‘మస్క్ ఇప్పటికీ ఇండియాలో పర్యటించలేదంటే నాకు కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఇండియాకు రాలేదంటే అతడు పెద్ద తప్పు చేస్తున్నట్టే. నా దృష్టిలో ఎలాన్ మస్క్ ముందు తన న్యూరాలింక్ సంస్థపై దృష్టి పెట్టాలి. ఆ కంపెనీ అద్భుతం. విరిగిన వెన్నెముకను మళ్లీ అతికించి కోల్పోయిన చూపును తిరిగి ఇప్పించేందుకు వాళ్లు కృషి చేస్తున్నారు. త్వరలోనే ఫలితాలు మనకు కనిపిస్తాయి’ అని ఎరోల్ మస్క్ అన్నారు. ఇటీవల కాలంలో మార్కెట్ ఒడిదుడుకుల గురించి కూడా ఎరోల్ మస్క్ స్పందించారు. అయితే, భారత్ భవిష్యత్తుగా మాత్రం అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి ఎలాన్ మస్క్ ఇటీవల భారత్‌లో పర్యటించాల్సి ఉన్నా టెస్లా సంస్థలో అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక ఎక్స్‌లో కంటెంట్ మోడరేషన్ విషయంలో కూడా మస్క్‌కు భారతీయ అధికారులకు మధ్య పొసగట్లేదు. ఇక భారత్‌లో టెస్లా కార్ల తయారీకి కూడా పెద్దగా అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో టెస్లా కేవలం కార్ల అమ్మకాలకే పరిమితమవుతుందని అంటున్నాయి.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 10:30 PM