Engineer suicide: నా అస్థికలు మురుగు కాలువలో కలిపేయండి
ABN, Publish Date - Apr 21 , 2025 | 04:27 AM
ఉత్తరప్రదేశ్‌లో మోహిత్ యాదవ్ అనే ఇంజనీర్ ఆస్తి రాసివ్వకపోతే వరకట్నం వేధింపుల కేసు పెడతామని భార్య, అత్తింటి వారు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన చివరి సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు కారణమైన వేధింపులు, పురుషుల రక్షణ కోసం చట్టాల అవసరం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు.
యూపీలో భార్యా బాధితుడి ఆత్మహత్య
భార్య, అత్తింటివారి వేధింపులు తాళలేక భర్త బలన్మరణం
వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తున్నారని సెల్ఫీ వీడియో
న్యాయం జరగకపోతే అస్థికలు కాలువలో కలపాలని ఆవేదన
లఖ్‌నవూ, ఏప్రిల్ 20: మహిళలు పెడుతున్న తప్పుడు కేసుల నుంచి పురుషులకు రక్షణ కల్పించాలనే అభిప్రాయాలు రోజురోజుకి అధికమవుతున్న వేళ ఓ దారుణం వెలుగు చూసింది. ఆస్తి రాసివ్వకపోతే వరకట్నం వేధింపుల కేసు పెడతామని భార్య, అత్తింటి వారు చేస్తోన్న వేధింపులు తాళలేక ఓ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన తర్వాత కూడా తనకు న్యాయం జరగకపోతే తన అస్థికలను మురికి కాలువలో కలిపేయండని ఆత్మహత్యకు ముందుకు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తల్లిదండ్రులను కోరాడు. ఉత్తరప్రదేశ్ ఇటావాలో జరిగిన ఈ ఘటనలో మోహిత్ యాదవ్(33) అనే ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాని కంటే ముందు ఓ సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు కారణాన్ని వెల్లడించి ఆ వీడియోను కుటుంబసభ్యులకు పంపాడు.మోహిత్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్న ప్రకారం.. యూపీలోని అరాయియా జిల్లాకు చెందిన మోహిత్, ప్రియ ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2023లో పెళ్లి చేసుకున్నారు. మోహిత్ ఓ సిమెంట్ పరిశ్రమలో ఫీల్డ్ ఇంజనీర్ కాగా, బిహార్‌లోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో రెండు నెలల క్రితం ప్రియకు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది.
ఆ సమయంలో ప్రియ గర్భంతో ఉండగా.. ఆమె తల్లి గర్భస్రావం చేయించింది. ప్రియకు సంబంధించిన ఆభరణాలన్నీ ఆమె తల్లి తన వద్దే ఉంచుకుంది. కాగా, పెళ్లి సమయంలో మోహిత్ అత్తింటి వారిని కట్నం అడగలేదు. కానీ, ఇల్లు, ఇతర ఆస్తులను ప్రియ పేరిట రాసివ్వకపోతే వరకట్నం కోసం వేధిస్తున్నారని కేసు పెడతామని ప్రియ, ఆమె కుటుంబం ఇటీవల మోహిత్ కుటుంబాన్ని వేధిస్తోంది. ప్రియ తండ్రి.. మోహిత్‌పై ఇప్పటికే ఓ తప్పుడు కేసు పెట్టగా, చంపేస్తానంటూ ఆమె సోదరుడు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రోజురోజుకి ఈ వేధింపులు అధికమవ్వడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని తల్లిదండ్రులకు మోహిత్ క్షమాపణలు చెప్పాడు. పురుషుల కోసం చట్టాలు ఉండుంటే తాను ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదని మోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. చావు తర్వాత కూడా న్యాయం జరగకపోతే తన అస్థికలను మురుగు కాలువలో కలపాలని తల్లిదండ్రులను కోరాడు. కాగా, ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 21 , 2025 | 04:27 AM