Elon Musk: ముగ్గురు పిల్లల్ని కనండి: మస్క్
ABN, Publish Date - Jun 28 , 2025 | 05:31 AM
జననాల రేటు తగ్గుదల మానవజాతికే ముప్పు అని ఎలాన్ మస్క్ హెచ్చరించారు. ఒకే సంతానంతో సరిపెట్టుకునేవారు లేదా అస్సలు పిల్లలు వద్దనుకునేవారితో వచ్చే లోటును భర్తీని చేయడానికి పిల్లల్ని కనగలిగేవారు..
న్యూఢిల్లీ, జూన్ 27: జననాల రేటు తగ్గుదల మానవజాతికే ముప్పు అని ఎలాన్ మస్క్ హెచ్చరించారు. ఒకే సంతానంతో సరిపెట్టుకునేవారు లేదా అస్సలు పిల్లలు వద్దనుకునేవారితో వచ్చే లోటును భర్తీని చేయడానికి పిల్లల్ని కనగలిగేవారు ముగ్గురు పిల్లల్ని కనాలని, లేదంటే జనాభా పతనమవుతుంది అని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేస్తూ పారిశ్రామికవేత్త మారియో నాఫాల్ షేర్ చేసిన పోస్టును కూడా దానికి జత చేశారు.
ఫార్చ్యూన్ నివేదికలోని వివరాలతో నాఫాల్ ఆ పోస్టు చేశారు. సుస్థిర జనాభా స్థాయిని కొనసాగించడానికి ప్రతి మహిళ సగటున 2.7 మంది పిల్లలకు జన్మనివ్వాలని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఆ సగటు 1.66గా ఉందని, చాలాధనిక దేశాల్లో పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉందని తెలిపింది.
Updated Date - Jun 28 , 2025 | 05:31 AM